Memantha Siddham Bus Yatra: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రాన్ని మరోసారి చుట్టేసే పనిలో పడిపోయారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో మళ్లీ ప్రజలతో మమేకం అవుతున్నారు.. ఇక, నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజుకు చేరుకుంది.. యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్.. శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు తన యాత్రను ప్రారంభిస్తారు.. బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్‌పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకోనుంది బస్సు యాత్ర..
Read Also: Venu Swamy : ఏంటి వేణుస్వామి.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా?
ఇక, పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకున్న తర్వాత మధ్యాహ్న భోజన విరామం తీసుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. అనంతరం బయలుదేరి కదిరి చేరుకోనున్నారు.. స్థానికంగా ఉన్న పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో రంజాన్‌ను పురస్కరించుకుని.. మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు సీఎం జగన్.. ఆ తర్వాత మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెకు చేరుకుని రాత్రి బస చేయనున్నారు. మరోవైపు.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు..