ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు ఇస్తూ నిత్యం ఏదోకటి చెప్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.. సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ వేణు స్వామి వార్తల్లో నిలుస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకునేలా జాతకాలు చెప్పడమే కాదు వివరణ ఇవ్వడం వేణు స్వామి ప్రత్యేకత.. ఇప్పటికే ఎంతో మంది గురించి సంచలన విషయాలను బయటపెడుతూ ఫేమస్ అయ్యాడు..
తాజాగా సోషల్ కొన్ని వీడియోలను వదిలాడు.. అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి.. భార్యతో కలిసి ప్రభాస్ డైలాగ్ తో రీల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటు నెటిజన్స్ అటు ప్రభాస్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభాస్ ఫై సంచలన వ్యాఖ్యలను చేసాడు.. ఇప్పుడు మరోసారి ప్రభాస్ డైలాగును వాడటంతో నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది.. ఈయన చెప్పిన మాటలు కొన్ని నిజం అవ్వడంతో కొందరు హీరోయిన్లు ఈయన ఏకంగా పూజలు కూడా చేయించుకున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
ఇదిలా ఉండగా.. తాజాగా తన భార్యతో రీల్ చేశాడు.. అది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. మిర్చి’ సినిమాలోని ప్రభాస్ – అనుష్క శెట్టి మధ్య సాగే ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఆ సీన్ ను వేణు స్వామి తన భార్య తో చేశాడు.. ఎప్పుడు ప్రభాస్ పై ట్రోల్స్ చేసే ఈయన ఇలా రీల్స్ చెయ్యడం పై డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆ వీడియో మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది..
Dey వేణు స్వామి😶
ఏంది రా అయ్య ఈ అరాచకం?.పైగా ఆమ్లెట్ వేస్తున్న షర్ట్
అగ్రహారం బడిత్య లాగా ఎంటి ఆ ఏషలు
నీ ఏజ్ ఎంటి
కింద గేజ్ ఎంటి..జై కొల్లి ఆగదు నాలొల్లి pic.twitter.com/KR43aoGYsk
— KOLLI DURGA VARA PRASAD (@hopekolli_babu) March 31, 2024