YS Jagan: పేదలకు మళ్లీ రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు..?
- డోర్ డెలివరీ విధానాన్ని తొలగించడంపై జగన్ మండిపడ్డారు
- మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు?
- ప్రజలను కష్టపెట్టడం సబబేనా? అని ప్రశ్నించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. నేడు ప్రజలకు రేషన్ రైస్ పంపిణీ చేశారు. అయితే ఈ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. డోర్ డెలివరీ విధానాన్ని తొలగించడంపై మండిపడ్డారు. జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు మీకు ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష?.. మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు?.. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలి.. ప్రజలను కష్టపెట్టడం సబబేనా? అని ప్రశ్నించారు.
Also Read:Vemulawada : ఆగని రాజన్న కోడెల మృత్యు ఘోష.. మరో ఐదు కోడెల మృతి
Also Read
ప్రభుత్వ సేవల డోర్‌డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా?.. వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20వేలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొడుతున్నారు… వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం?.. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?.. పారదర్శకంగా ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా?.. ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగానూ, మాఫియా ముఠా సభ్యులుగానూ చిత్రీకరించేలా నిన్న మీరుచేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవని అన్నారు.
Also Read:Narne Nithin : నార్నే నితిన్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’ ట్రైలర్ రిలీజ్..
వైసీపీ ప్రభుత్వం రాకముందు ప్రతినెలా ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ఎన్నో ప్రభుత్వ సేవలకోసం పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు.. ఎండనక, వాననక క్యూలైన్లలో రేషన్ షాపులముందు పడిగాపులు పడేవారు. ఎప్పుడు రేషన్ ఇస్తారో, ఎంతసేపు రేషన్ ఇస్తారో తెలియక కూలీపనులు, ఇతరత్రా పనులు మానుకుని నిరీక్షించేవారు.. ఈ క్రమంలో లబ్ధిదారులు వివక్షను, అవమానాలు ఎదుర్కొనేవారు.. దోపిడీకి గురయ్యేవారు.. సరైన తూకంతో, నాణ్యతతో సరుకులు అందుకున్న సందర్భం లేదు.. ఈ కష్టాలు పడలేక కొంతమంది రేషన్ సరుకులు తీసుకోవడం కూడా మానేశారు.. దీనిపై నా పాదయాత్రలో ప్రజలు నా వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Also Read:Always Shubhu Baby: హార్దిక్, శుభ్‌మన్ గిల్ మధ్య గొడవ.. “ఆల్వేస్ శుభూ బేబీ” అంటూ..!
మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలతోపాటు, ఇంటివద్దకే రేషన్ అందించే డోర్‌డెలివరీని ప్రారంభించింది. బియ్యం క్వాలిటీని పెంచి, మధ్యస్త సన్నబియ్యాన్ని, ప్రజలు తినగలిగే నాణ్యమైన, సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ప్యాక్‌చేసి, రేషన్ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికీ అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేసింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం రేషన్ డోర్‌డెలివరీని రద్దు చేయడం, పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా? అని అన్నారు.
Also Read:IPL 2025 Qualifier 2: ముంబై vs పంజాబ్ మ్యాచ్ కు వర్షం అడ్డుకాబోతుందా.. అయితే ఫైనల్ చేరుకునేది ఎవరు?
దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారు? నెలకు 10వేలు ఇస్తామంటూ వాలంటీర్లను మీ వైపు తిప్పుకుని ఎన్నికల్లో వాడుకుని, తీరా అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్ధాలు ఆడుతూ వారిని రోడ్డుమీద నిలబెట్టారు.. హేతుబద్ధీకరణ పేరుతో గ్రామవార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33వేల శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధికట్టారు.. గ్రామాల్లో అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ సేవలు, ఆర్బీకేలు, సచివాలయాలు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేశారు.. గ్రామాల్లో, వార్డుల్లో డోర్‌డెలివరీ సంగతి పక్కనపెడితే, ఏకంగా ప్రభుత్వ సేవలు అందడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read:Abhirami: కమల్ హాసన్‌తో లిప్ కిస్ పై స్పందించిన నటి అభిరామి..
తాజాగా ఈ మూర్ఖపు చర్య కారణంగా, రేషన్ వాహనాల తొలగింపుతో వారి కష్టాలు మరింత పెరిగాయి.. అంతేకాదు ఈ వాహనాలపై ఆధారపడ్డ 20వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.. కనీసం వారికి ప్రత్యామ్నాం కూడా చూడలేదు.. మొత్తంగా మీరు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లుగా పనిచేస్తున్న 2.6లక్షల మంది, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్‌ల్లో తొలగించిన వాటితో కలిపితే మొత్తంగా 3 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు.. ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు అంటూ జగన్ ఎద్దేవ చేశారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!