IPL 2025 Qualifier 2: ఐపీఎల్ 2025 సీజన్‌లో రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ నేడు ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు అభిమానులు వర్షం పరిస్థితులపై ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ మ్యాచ్ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? వర్షం వస్తే ఎవరు ఫైనల్‌కు అర్హులు అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Read Also: PBKS vs MI: నేడే క్వాలిఫయర్ 2 మ్యాచ్.. పంజాబ్ పంతమా..? ముంబై మాస్టర్ ప్లానా..? ఫైనల్ చేరేదెవరు..!
ఇక అహ్మదాబాద్ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. నేడు వాతావరణం కొద్దిగా మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, వర్షం వచ్చే అవకాశాలు కేవలం 5% మాత్రమే ఉంది. సగటుగా 34°C వరకు వాతావరణం ఉంటుంది. మ్యాచ్ సమయంలో సాయంత్రం 29°C వరకు తగ్గే అవకాశం ఉంది. వాన అనేది పెద్దగా సమస్య కాకపోవచ్చని అంచనా. సాధారణంగా మ్యాచ్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా సాగే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే (నో టాస్, నో ఓవర్), బీసీసీఐ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును ఫైనల్‌కు పంపుతారు. ఈ నిబంధనల ప్రకారం పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్‌గా 19 పాయింట్లతో ముగించినందున, వారు నేరుగా జూన్ 3న జరిగే ఫైనల్‌కు అర్హత పొందుతారు.
Read Also: Always Shubhu Baby: హార్దిక్, శుభ్‌మన్ గిల్ మధ్య గొడవ.. “ఆల్వేస్ శుభూ బేబీ” అంటూ..!
బీసీసీఐ IPL 2025 సీజన్ కోసం కొత్త వర్ష నిబంధనలను ప్రవేశపెట్టింది. గతంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అయితే, ఒక గంట లేదా 90 నిమిషాల తర్వాత ఓవర్లను తగ్గించడం జరుగుతుండేది. కానీ ఈసారి, మ్యాచ్ మొదలు కావడానికి అదనంగా 2 గంటల సమయం ఇవ్వనున్నారు. అంటే ఉదాహరణకు, మ్యాచ్ ఆలస్యం అయితే రాత్రి 10:30 గంటల వరకు కూడా మ్యాచ్ మొదలు కావచ్చు ఎలాంటి ఓవర్ల తగ్గింపు లేకుండా. అలాగే, ఆటలో వర్షం కారణంగా ఆట నిలిపివేసినా, రాత్రి 2 గంటల వరకు మ్యాచ్ కొనసాగించవచ్చు. సాధారణంగా మ్యాచ్ 12 గంటలలోపు ముగియాలి. కానీ, ఇప్పుడు ఇది రాత్రి 2 వరకు పొడిగించవచ్చు. ఈ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో విజేత జట్టు, జూన్ 3న ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఎదుర్కొంటుంది.