NTV Telugu Site icon

YS Jagan: సూపర్‌-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్‌.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Ys Jagan

Ys Jagan

YS Jagan: సూపర్‌-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్‌ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. హామీలు అమలు చేయలేకనే బడ్జెట్‌ను ఆలస్యం చేశారని అన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పటికీ మారరన్నారు. 2018-19 నాటికి ప్రభుత్వం చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు అని.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 6.46 లక్షల కోట్లు అప్పులు రాష్ట్రానికి ఉన్నాయన్నారు. వాస్తవాలు ఏమిటో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయన్నారు. 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చంద్రబాబు రాష్ట్రం అప్పులపై అసత్యాలు చెప్పటం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. కాగ్‌ రిపోర్టుపై కూడా తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు.

Read Also: Earth’s Magnetic Poles: భూమి అయస్కాంత ఉత్తర ధ్రువం రష్యా వైపు కదులుతోంది.. ప్రళయం తప్పదా..?

బీజేపీలో కూడా టీడీపీకి చెందిన మనుషులే ఉండి టీడీపీ అసత్యాలకు మద్దతు ఇస్తారని విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో లెక్కలు కూడా చంద్రబాబు పెట్టారన్నారు. కాగ్ ధృవీకరించిన తర్వాత కూడా అప్పులపై మళ్ళీ మాట మారుస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్ పై మాట మార్చటం చంద్రబాబు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 2019లో దిగిపోయే ముందు సుమారు 42 వేల కోట్ల బకాయి పెట్టారన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని మించి చంద్రబాబు రూ.28,457 కోట్లు అధిక అప్పులు చేశారని.. వైసీపీ హయాంలో రూ1647 కోట్లు మాత్రమే ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని మించి అప్పులు చేశామన్నారు. ఎవరు ఆర్థిక విద్వంసం చేశారో అర్థం అవుతోందన్నారు. రెండేళ్లు కొవిడ్ వల్ల ఇబ్బందులు పడినా కూడా పరిపాలన మాత్రం గాడి తప్పలేదన్నారు. చంద్రబాబు హయాంలో కంటే మా హయంలో 4 శాతం అప్పులు తగ్గాయన్నారు. ఎవరు ఆర్థిక విధ్వంసకారులు అనేది ఈ లెక్కలు చెబుతాయన్నారు.

 

Show comments