Site icon NTV Telugu

Siddipet: BMW కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య..

Software Engineer Suicide

Software Engineer Suicide

సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. BMW కారును కొనివ్వలేదన్న కారణంతో 21 ఏళ్ల యువకుడు జానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే కనకయ్యది మధ్య తరగతి కుటుంబం. కానీ.. కొద్దిరోజులుగా తనకు BMW కారు కావాలని కుమారుడు జానీ అడిగాడు.

READ MORE: TTD: పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. టీటీడీ వార్నింగ్..

కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో తండ్రి కనకయ్య, BMW కారుకు బదులుగా స్విఫ్ట్ కారును కొనిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తండ్రి తన కుమారుడిని సిద్దిపేటలోని ఓ కార్ షోరూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ స్విఫ్ట్ కారును చూపించాడు. అయితే అది నచ్చకపోవడంతో జానీ నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. కారు కొనివ్వలేదని తీవ్ర మనస్తాపానికి గురైన జానీ పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ములుగులోని ఆర్‌వీఎమ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జానీ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

READ MORE: BJP MP: ‘‘భారత్ తమ దేశాన్ని విభజిస్తుందని పాకిస్తాన్ భయం’’.. బలూచిస్తాన్‌పై నిషికాంత్ దూబే..

Exit mobile version