Lover Suicide: హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో గల జిల్లెల్లగూడలోని డీఎన్ఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందని మదన్ యాదవ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.
Suicide : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముదిరాజ్ వీధికి చెందిన దీటి రోహిత్ (23) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు రోహిత్ ఓ సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. అందులో అతను వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు, విఫలమైన ఆశల గురించి విచారం వ్యక్తం చేశాడు. “నీ కొడుకు అయితే వాని…
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. BMW కారును కొనివ్వలేదన్న కారణంతో 21 ఏళ్ల యువకుడు జానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే కనకయ్యది మధ్య తరగతి కుటుంబం. కానీ.. కొద్దిరోజులుగా తనకు BMW కారు కావాలని కుమారుడు జానీ అడిగాడు.
ఆన్లైన్ గేమ్స్ మరో యువకుడి ప్రాణాలు తీసింది. బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైరేట్ గ్రామానికి చెందిన జైచంద్రగా గుర్తించారు. ఆన్‌లైన్ గేమ్స్, యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దంటూ టీషర్ట్‌పై రాసుకున్నాడు యువకుడు. అయితే.. బెట్టింగుల కారణంగా తీవ్ర అప్పుల పాలై అవి తీర్చలేక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
కృష్ణా జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అదుపులోనికి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో విచ్చలవిడిగా క్రికెట్ ఆన్లైన్ బెట్టింగులు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నియోజకవర్గ పరిధిలో ఉంగుటూరు మండలంలో 10మందిని, గన్నవరం మండలంలో 10మందిని, బాపులపాడు మండలంలో మరికొందరు క్రికెట్ భూకీలను అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో యువత వ్యసనాలకు బానిసలై బెట్టింగులకు పాల్పడుతున్నారు.
మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సోమేశ్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమేశ్ తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని తన కొడుకు సోమేశ్ తెల్లవారు 4గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ తెలిపారు. తమ ఇంటి సమీపంలోని గౌడవెల్లిలో రైల్ ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నడన్నారు. లక్షల్లో సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ పెట్టాడని తెలిపారు. గతంలో తమ కూతురు…