Andhra News: అనంతపురంలో వర్ష బీభత్సం.. ఇళ్లలోకి భారీగా వరద నీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra News: అనంతపురం నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీల్లోని వరద పోటెత్తింది. కాలనీల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో ఇళ్లలోనికి నీరు ప్రవేశించి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాత్రి రెండు గంటల సమయం నుంచి భారీ వర్షంతో ఎగువ నుంచి వరద విజృంభించింది. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వరద అనంతపురం నగరాన్ని ముంచెత్తింది. ఇళ్లలోకి వరద ప్రవేశించటంతో అర్ధరాత్రి దాటాక ప్రజలు మిద్దెలపైకి వెళ్లి భయంగా గడిపారు. ఇప్పటికీ చాలా కాలనీల్లో మూడు అడుగుల మేర వరద ప్రవహిస్తూనే ఉంది.
ఇదివరకే కురిసిన వర్షాలకు నిండుగానున్న చెరువుల్లో నుంచి నీరు మత్తడి పారుతోంది. ప్రధానంగా అనంతపురం రూరల్ పరిధిలో గల రుద్రంపేట నుంచి అనంతపురం నగరంలోకి వచ్చే చోట నడిమివంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రుద్రంపేట, అనంతపురం నగరానికి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 4వ రోడ్డులోని రజక్ నగర్, రంగస్వామినగర్, సీపీఐ కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Also Read
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
Read Also: Fire : కార్లలో మంటలు.. కలవరపడిన ప్రయాణికులు
వరద నీటిలో చిక్కుకున్న హాస్టల్ విద్యార్థులను రక్షించిన అనంతపురం పోలీసులు
వరద నీటితో చిక్కుకున్న 30 మంది హాస్టల్ విద్యార్థులను సురక్షితం చేసిన 4వ పట్టణ పోలీసులు. నిన్న రాత్రి కురిసిన వర్షం, పైతట్టు ప్రాంతాల నుండి వచ్చిన వరద నీటితో స్థానిక వికలాంగుల కొట్టాలలోని శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 30 మంది చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సి.ఐ జాకీర్ హుస్సేన్,సిబ్బందితో కలసి అక్కడికి వెళ్లి ఆ పాఠశాలకు చెందిన బస్సు ద్వారానే 30 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో పాటు విశ్వశాంతి నగర్ లోని ఓ ఇంట్లో చిక్కుకున్న ఇద్దరు వృద్ధులను, ఆరు బర్రెలను సురక్షితం చేశారు.
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!