Nagaland BJP president Temjen Imna Along got a funny request from young man: రాజకీయ నాయకులకు తమ నియోజకవర్గ ప్రజల నుంచి నిత్యం వినతులు వస్తుంటాయి. నీటి సదుపాయం అందించాలని, రోడ్లు బాగు చేయాలని, ఉద్యోగాలు కల్పించండని, సరైన విద్య లేదా వైద్యం అందించాలని ప్రజల నుంచి రాజకీయ నాయకులకు వినతులు వస్తుంటాయి. ఇది సర్వసాధారణమే. అయితే తాజాగా ఓ రాజకీయ నాయకుడికి ఓ యువకుడి నుంచి వింత వినతి వచింది. తన డ్రీమ్ గర్ల్‌తో మొదటిసారి డేట్‌కు వెళుతున్నానని, తనకు కాస్త డబ్బు సాయం చేయండని కోరాడు. ఈ వింత విజ్ఞప్తి నాగాలాండ్లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నాగాలాండ్ బీజేపీ అధ్యక్షుడు, మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్‌కు అరవింద పాండే అనే యువకుడి నుంచి ఫన్నీ వినతి వచ్చింది. ‘సర్.. అక్టోబర్ 31న నా డ్రీమ్ గర్ల్‌తో మొదటిసారి డేట్‌కు వెళ్తున్నా. కానీ నాకు జాబ్ లేదు. నా వద్ద డబ్బులు లేవు కాబట్టి మీ నుంచి చిన్న సహాయం కావాలి. ప్లీజ్ సర్.. ఏదైనా చేయండి’ అని మంత్రి అలోంగ్‌ని అరవింద కోరాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మంత్రి.. ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ‘నేనేం చేయగలనో చెప్పండి’ అని బదులిచ్చారు.
Also Read: IND vs ENG: ఇంగ్లండ్‌పై విజయం.. వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు!
ఈ విషయాన్ని మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్ తన ఎక్స్‌లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు సరదాగా స్పందించారు. ‘పాపం కుర్రాడు.. డబ్బు ఇవ్వండి మంత్రి గారు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఆ లవర్ బాయ్‌ను ఎమ్మెల్యే చేయండి’ అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో ఫన్నీగా పోస్టులు పెట్టే మంత్రి తెమ్జెన్.. గతంలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గూగుల్‌లో తెమ్జెన్ భార్య అంటూ కనిపించిన ఓ స్క్రీన్ షాట్‌ను అభిమానులతో పంచుకుని.. ‘గూగుల్ నన్ను ఉత్సాహానికి గురి చేసింది. నేను ఆమె కోసం వెతుకుతున్నా’ అని పేర్కొన్నారు.