ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. నేపాల్ కి చెందిన బాలిక జూబ్లీహిల్స్ లో తల్లితండ్రితో కలిసి నివాసం ఉంటోంది. బాలిక కి తన ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు కృష్ణ తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో బాలిక ను ట్రాప్ చేశాడు కృష్ణ.. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో ఇంట్లో నుంచి బాలిక వచ్చేసింది.
దీన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు రెండు రోజులపాటు ఫస్ట్ ఫుడ్ సెంటర్లోనే బందించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తమ కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఆందోళను గురయ్యారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక ను ట్రేస్ చేసి పట్టుకున్నారు. కృష్ణ పై ఫాక్సో కేసు నమోదు.. రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.