కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు జలసమాధి అయిన ఘటన కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడిని మానకొండూర్ మండలం ఉటూరు గ్రామానికి చెందిన సంగం రాజు గా పోలీసులు గుర్తించారు. ఉన్నట్టుండి రాజు మిస్ అవ్వడంతో తల్లి స్వరూప పెట్టిన మిస్సింగ్ కేసు ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read:Anaganaga oka Raju : జనవరి 14న థియేటర్ లోకి పండగ సినిమా రాబోతుంది
నిన్న మధ్యాహ్నం 3గంటల నుండి గాలింపు చర్యలు మొదలయ్యాయి. యువకుడు ప్రయాణిస్తున్న కారు బావిలో పడ్డట్లు గుర్తించారు. రెస్య్కూ టీం పోలీస్ అధికారులు గంటల తరబడి శ్రమించి కారుతో పాటు యువకుడి మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీశారు. వేగురుపల్లిలో బావిలో నుండి అర్ధరాత్రి కారును బయటకు తీశారు. రాత్రి 11:30 నిముషాలకు రెస్క్యూ టీంకి కారు చిక్కింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.