టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు స్పీడును పెంచుతున్నారు.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టుకుంటున్నారు.. కొందరు హీరోలు వరుస హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు.. ఆ హీరోలు రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు.. తేజ సజ్జ , సిద్దు జొన్నలగడ్డ , విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలు అందరూ కూడా తమ సినిమాలతో భారీ గుర్తింపు సొంతం చేసుకోవడమే కాదు భారీగా రెమ్యూనరేషన్ ను కూడా పెంచేసినట్టు తెలుస్తోంది.. ఈ ముగ్గురు యంగ్ హీరోలు కూడా మంచి విజయాలు అందుకుంటున్నారు.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న స్టార్ హీరోలు వీళ్లే.. ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
తేజా సజ్జా..
ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తేజా.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకి రూ.25 కోట్ల నుండి రూ.30 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. ప్రస్తుతం మిరాయ్ సినిమాలో నటిస్తున్నాడు.. దీంతో పాటుగా మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు..
విశ్వక్ సేన్….
టాలీవుడ్ మాస్ హీరో యంగ్ హీరో విశ్వక్ సేన్ గామి సినిమాతో ఒక డిఫరెంట్ జోనర్ అయితే చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు అంతకుమించి పేరు కూడా దక్కించుకున్నారు.. కాబట్టి తన రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు రూ.20 కోట్లకు పెంచేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
సిద్దు జొన్నలగడ్డ..
ఓవర్ నైట్ స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టిల్లు స్క్వేర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడం తో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. దాంతో హీరో రేంజ్ పూర్తిగా మారింది.. ప్రస్తుతం రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తుంది.. ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల వరకు తీసుకుంటున్నారు.. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు..