Kantara Chapter 1: తొలి వీకెండ్‌లోనే రికార్డులు బ్రేక్ చేసిన ‘కాంతార’.. ఏకంగా ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే!
- రిషబ్ శెట్టి నటించిన కాంతార: చాప్టర్ 1 తొలి వీకెండ్‌లోనే 335 కోట్లు గ్రాస్ వసూళ్లు
- కేజీఎఫ్ 2 తర్వాత శాండల్ వుడ్‌లో అత్యధిక తొలి వీకెండ్ వసూళ్లు సాధించిన రెండో చిత్రం.
- కర్ణాటకలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం వెర్షన్లలో కూడా అద్భుత కలెక్షన్లు.
- ఆదివారం రోజున అత్యధిక సింగిల్ డే కలెక్షన్ నమోదు
- దీపావళి వరకు కూడా కలెక్షన్ల జోరు కొనసాగుతుందని ట్రేడ్ అంచనా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara Chapter 1: రిషబ్ శెట్టి (Rishab Shetty) లీడ్ రోల్ లో నటించిన తాజాచిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1). ఈ సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి వీకెండ్‌లోనే ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను నమోదు చేసింది. ఆదివారం రోజున, ఈ సినిమా తన అత్యధిక సింగిల్ డే కలెక్షన్‌ను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తాజాగా వచ్చిన నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌లో ఏకంగా 335 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ అయ్యింది.
Sachin-Thaman: మాస్టర్ బ్లాస్టర్‌తో తమన్.. త్వరలో కలసి పనిచేస్తా అంటూ..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ కలెక్షన్లతో కన్నడ సినీ పరిశ్రమ (Sandalwood) చరిత్రలో ‘కేజీఎఫ్ 2’ తర్వాత అత్యధిక తొలి వీకెండ్ వసూళ్లు సాధించిన రెండో అతిపెద్ద చిత్రంగా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతుంది. ఈ చిత్రం కేవలం కన్నడ వెర్షన్ లో మాత్రమే కాకుండా.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వెర్షన్లు కూడా చక్కటి వసూళ్లు సాధిస్తూ సంచనాలు సృష్టిస్తోంది. దైవత్వం, యాక్షన్ అంశాలు కలగలిపిన ఈ సినిమా రాబోయే దీపావళి పండుగ వరకు కూడా భారీ వసూళ్లు నమోదు చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. విజయ్ కిరగందూర్ సారథ్యంలోని హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఈ చిత్రాన్ని నిర్మించింది. రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..