2025 Nobel Prize: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల పేర్లను సోమవారం ప్రకటించారు. తొలి నోబెల్ బహుమతి వైద్య రంగంలో ముగ్గురు వైద్యులకు సంయుక్తంగా లభించింది. అమెరికాలోని సీటెల్‌కు చెందిన మేరీ ఇ. బ్రుంకో, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఫ్రెడ్ రామ్స్‌డెల్, జపాన్‌కు చెందిన షిమోన్ సకాగుచిలకు ఈ బహుమతి వరించింది. బ్రుంకో.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ విభాగంలో పని చేస్తుండగా, రామ్స్‌డెల్ సోనోమా బయోథెరప్యూటిక్స్ విభాగంలో పని చేస్తున్నారు. సకాగుచి జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. నోబెల్ బహుమతుల విజేతల పేర్లను అక్టోబర్ 13వ తేదీ వరకు ప్రకటించనున్నారు.
READ ALSO: Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో సంచలనం.. భారీగా మద్యం, స్పిరీట్ పట్టివేత..
“మేరీ ఇ. బ్రూనో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకాగుచి ముగ్గురు రోగనిరోధక వ్యవస్థ ఎలా నియంత్రించబడుతుందో పరిశోధించారు. ఈ పరిశోధనలో వారి ఆవిష్కరణల ఫలితంగా ఈ ముగ్గురినీ నోబెల్ బహుమతి వరించింది. వారి ఆవిష్కరణలు కొత్త పరిశోధనా రంగానికి పునాది వేయడంతో పాటు, క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు వంటి రోగాలకు కొత్త చికిత్సల అభివృద్ధికి ప్రేరణనిచ్చాయి” అని నోబెల్ కమిటీ పేర్కొంది.
ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం తరువాత ఈ నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని వివిధ రంగాలలో బహుమతులను అందజేయడానికి వీలునామా రాశారు. 1895 నాటి ఆయన వీలునామా ప్రకారం.. “గత ఏడాదిలో, మానవాళికి గొప్ప ప్రయోజనం చేకూర్చిన వారికి” బహుమతులు ప్రదానం చేయాలని ఆయన నిర్దేశించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 10న నోబెల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి. ఈ రోజున నోబెల్ బహుమతులు గ్రహీతలకు ప్రదానం చేస్తారు. మొదటి నోబెల్ బహుమతులు 1901లో ప్రదానం చేశారు. నాటి నుంచి ఏటా అందజేస్తున్నారు. అప్పటి నుంచి కొన్ని సార్లు నోబెల్ బహుమతులు ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు కొనసాగిన సమయంలో నోబెల్ బహుమతులు ఇవ్వలేదు.
READ ALSO: Arakan Army: బంగ్లాదేశ్ విచ్ఛిన్నానికి ప్లాన్.. ప్రత్యేక ప్రావిన్స్‌గా రఖైన్ ఏర్పడుతుందా?