యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నిఖిల్ హ్యాపీ డేస్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. స్వామి రారా, కార్తికేయ మరియు ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ యంగ్ హీరో నటించిన కార్తికేయ 2 సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ విజయం సాధించింది.కార్తికేయ 2 తరువాత నిఖిల్ నటించిన స్పై సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది..తాజాగా నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వయంభు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో స్వయంభు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరాకక్కుతున్న స్వయంభు సినిమా లో నిఖిల్ లాంగ్ హెయిర్ తో కనిపించనున్నారు. ప్రస్తుతం కత్తి సాము వంటి యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడు.పాన్ ఇండియా మూవీగా స్వయంభు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.స్వయంభు సినిమా నిఖిల్ 20వ చిత్రంగా తెరకెక్కుతుంది..ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచార్య దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది…
ఇదిలా ఉంటే నిఖిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే నిఖిల్ తండ్రి కాబోతున్నాడట. ఆయన భార్య పల్లవి ప్రెగ్నెంట్ అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది… ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న పల్లవి బేబీ బంప్ తో కనిపించిన్నట్లు తెలుస్తుంది.. ఈ క్రమంలో పల్లవి గర్భవతి అంటూ కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. నిఖిల్, పల్లవి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వృత్తిరీత్యా పల్లవి డాక్టర్ కాగా ఆమెను నిఖిల్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2020లో కోవిడ్ ఆంక్షల మధ్య వీరి వివాహం జరిగింది పెళ్ళై నాలుగేళ్లు అవుతుండగా నిఖిల్-పల్లవి త్వరలోనే ఈ స్వీట్ న్యూస్ చెప్పనున్నారట.అయితే ఆ మధ్య నిఖిల్, పల్లవి విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను తమదైన శైలిలో ఈ జంట ఖండించారు. ఇద్దరూ జంటగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నిఖిల్ గత చిత్రం స్పై నిరాశపరిచింది