YCP vs TDP: బెజవాడలో ఫ్లెక్సీల రాజకీయం కాకరేపుతోంది.. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది పరిస్థితి… పటమట సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది.. ఎన్టీఆర్, సీఎం జగన్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. ఎన్టీఆర్ కి శత జయంతి నీరాజనాలు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు.. అయితే, అవినాష్ ఫ్లెక్సీల ఏర్పాటుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.. ఫ్లెక్సీల ఏర్పాటు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. భారీగా పోలీసులను మోహరించారు. ఇక, ఘటనపై స్పందించిన వైసీపీ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్.. టీడీపీపై సెటైర్లు వేశారు.
Read Also: Andhra Pradesh: బదిలీలకు అప్పటి వరకు దరఖాస్తు పెట్టుకోవాలి.. ఇవి కీలకం..
ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం .. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నాం అని తెలిపారు దేవినేని అవినాష్.. ఎన్టీఆర్ లలితకళా అవార్డును పోసానికి ఇస్తున్నాం.. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారని మండిపడ్డారు.. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి నేత వైఎస్ జగన్ అని గుర్తుచేశారు. ఇక, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వైసీపీ ఫ్లెక్సీలపై దేవినేని అవినాష్ స్పందిస్తూ.. మేం కూడా ఎన్టీఆర్ అభిమానులమే.. ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు మాకుందన్నారు.. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి రాసివ్వలేదు.. అది వాళ్ల పార్టీ ఆఫీసు కాదు అని ఎద్దేవా చేశారు. మేం బ్యానర్లు కట్టే వరకు అక్కడ ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే వారే లేరన్నారు. వారి ప్రవర్తన చాలా బాధగా కలిగించింది.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కవ్వింపు చర్యలు.. అల్లర్లను ప్రోత్సహించే విధానం మానుకోవాలని గద్దె రామ్మోహన్‌ను హెచ్చరించారు దేవినేని అవినాష్.