జస్ట్ ఒక్క హిట్ కయాదు లోహర్ కెరీర్నే టర్న్ చేసేసింది. ప్రదీప్ రంగనాథన్- అశ్వత్ మారిముత్తు కాంబోలో వచ్చిన డ్రాగన్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ బ్యూటీని చేసేసింది. ఎంతలా అంటే ఈ నాలుగేళ్ల కెరీర్‌లో ఆమె చేసిన సినిమాల కన్నా ఈ ఏడాది కమిటైన ప్రాజెక్టులే ఎక్కువ. డ్రాగన్ తర్వాత కయాద్ సుమారు అరడజను సినిమాలకు సైన్ చేసిందని టాక్. కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ లోను వరుస సినిమాలను లైన్ లోపెట్టింది కయాదు లోహర్.
తెలుగులో శ్రీవిష్ణుతో అల్లూరితో ఎంట్రీ ఇవ్వగా అప్పట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ డ్రాగన్ క్లిక్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది. ప్రజెంట్ క్రేజ్ ఉన్న హీరోయిన్‌కే డిమాండ్ కాబట్టి కయాదు లోహర్ చెంతకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తమిళంలో ఇప్పటికే ‘ఇదయం మురళి’ అనే సినిమా చేస్తోన్న భామ శింబు 49 మూవీకి కమిటైంది. అలాగే జీవీ ప్రకాష్ ‘ఇమ్మోర్టల్’ లోను ఈ బ్యూటీనే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఇక మలయాళంలో నివిన్ పౌలీ సరసన తారంలో నటిస్తోంది. అలాగే తెలుగులో కూడా ఛాన్సులు క్యూ కడుతున్నాయి. విశ్వక్ సేన్ ఫంకీలో మేడమ్ ఫిక్సైంది. అలాగే రవితేజ ప్రాజెక్టులో అమ్మడి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు టాలీవుడ్ హై ఆక్టేన్ మూవీ ప్యారడైజ్‌లో నానికి పెయిర్‌గా కయాద్ లోహార్‌ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసారు. ఇలా తెలుగు, తమిళ్, మళయాలం సినిమాలతో కయాదు లోహర్ హీరోయిన్ గా ఎదిగేందుకు దూసుకెళ్తోంది.