క్రికెట్ మైదానంలో కొన్నిసార్లు ఫన్నీ సీన్లు చూస్తుంటాం. వాటిని చూస్తే నవ్వు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. బంగ్లాదేశ్-జింబాబ్వే మధ్య జరిగిన నాలుగో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. జింబాబ్వే ఫీల్డర్లు వికెట్ త్రో కొట్టడానికి పడుతున్న విన్యాసాలను చూస్తే మరీ ఇంత చిన్నపిల్లల్లా ఉన్నారేంట్రా బాబు అని అంటారు. మిడిల్ గ్రౌండ్‌లో చేసిన ఫీల్డింగ్ చూసి మీరు కడుపుబ్బ నవ్వుకుంటారు. కాగా.. జింబాబ్వే ఫీల్డర్ల చిన్నపిల్లల చర్యల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
BJP: పంజాబ్‌లో మరో అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
ఈ వీడియోలో.. బంగ్లాదేశ్ బ్యాటర్ బంతిని కొట్టి పరుగులు తీస్తుండటం చూడొచ్చు. బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి కోసం బౌలర్ వేగంగా బంతి దగ్గరికి వెళ్లి, స్టంప్‌పైకి విసిరాడు. అయితే బౌలర్ వేసిన త్రో వికెట్‌కు తగలకుండ పక్కకు వెళ్లిపోతుంది. అది చూసిన బ్యాట్స్‌మెన్స్ ఇద్దరూ మరో పరుగును సాధించడానికి పరుగులు తీశారు. ఓవర్ త్రోలో పరుగులు తీస్తున్న బ్యాట్స్‌మన్‌ని చూసి, ఫీల్డర్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బంతిని విసిరాడు. స్టంప్ దగ్గర నిలబడి ఉన్న మరో ఫీల్డర్ రెండు మూడు ప్రయత్నాలలో బంతిని క్యాచ్ పట్టి స్టంప్‌కు తగిలించేందుకు ప్రయత్నిస్తాడు. జింబాబ్వే ఫీల్డర్ స్టంప్‌లకు చాలా దగ్గరగా నిలబడినా వికెట్లకు కొట్టడంలో విఫలమయ్యాడు. జింబాబ్వే ఫీల్డర్ ఈ ఫీల్డింగ్ చూసి సోషల్ మీడియాలో అభిమానులు నవ్వుకుంటున్నారు.
PM Modi: సిక్కుల దుస్థితిని చూసి అవమానంగా ఫీలయ్యా
కాగా.. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించింది. తంజీద్ హసన్, సౌమ్య సర్కార్ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించి తొలి వికెట్‌కు 101 పరుగులు జోడించారు. తంజీద్ 52 పరుగులు, సర్కార్ 41 పరుగులు చేశారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా పడిపోవడంతో మొత్తం జట్టు 143 పరుగులకే ఆలౌటైంది.
VILLAGE MUCH? #BANVvsZIMhttps://t.co/Uu8V0sFPWN
— 🏏Flashscore Cricket (@FlashCric) May 10, 2024