PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

  • నేడు విశాఖకు ప్రధాని మోడీ
  • భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు
  • శనివారం ఉదయం ఆర్కే బీచ్‌కు ప్రధాని మోడీ
Pm Modi

Pm Modi

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు విశాఖకు రానున్నారు. ప్రధాని శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ఆఫీసర్స్‌ మెస్‌కు వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. రాత్రికి తూర్పు నౌకాదళం గెస్ట్ హౌస్‌లోనే బస చేస్తారు.

శనివారం ఉదయం 6.25కు రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం సాగరతీరంలోని ఆర్కే బీచ్‌కు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఉదయం 6.30 నుంచి 7.50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా విన్యాసాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. అలానే యోగా విన్యాసాల్లో 5 లక్షలు మంది ప్రజలు పాల్గొననున్నారు. యోగా కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ మాట్లాడతారు.

Also Read: ENG vs IND: నేడే ఇంగ్లండ్, భారత్ తొలి టెస్టు.. ప్లేయింగ్ 11, పిచ్‌, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్!

యోగా కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ ఉదయం 7.50కు బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ఆఫీసర్స్‌ మెస్‌కు వెళతారు. ఉదయం 8.15 నుంచి 11.15 వరకు ప్రధాని పలు ప్రొగ్రామ్‌లు రిజర్వ్‌లో ఉన్నాయి. ఉదయం 11.25కు ఐఎన్‌ఎస్‌ సర్కార్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని.. 11.50కి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు. పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి భార్యను ప్రధానిని కలిసే అవకాశం ఉంది.