సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో వార్షికోత్సవ సభ.. ఎల్లుండే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ సభ ఎల్లుండి జరగనుంది. సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనున్నది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. భవిష్యత్తు కార్యాచరణ.. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ వివరించనున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యాలు.. పి 4పై ప్రత్యేక పవర్ పాయింట్…
జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్ లో విజయం పారిస్ డైమండ్ లీగ్ 2025 పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. జూన్ 20న (శుక్రవారం) పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో నీరజ్ తన సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన జూలియన్ వెబర్‌ను ఓడించాడు. గత రెండు టోర్నమెంట్లలో నీరజ్ వెబర్ చేతిలో ఓడిపోయాడు, కానీ ఇప్పుడు ఆ…
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025లో భాగంగా మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖలో 26,395 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సూర్య నమస్కార కార్యక్రమం ఉండబోతుంది. రేపు వాతావరణం అనుకూలించక వర్షం పడితే.. ఆర్కే బీచ్ రోడ్డులో కార్యక్రమాలు రద్దు చేసి మొత్తం కార్యక్రమం ఇదే వేదిక వద్ద నిర్వహించే అవకాశం ఉంది. వాతావరణం…
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరతీరం ముస్తాబయింది. యోగాంధ్ర 2025 కోసం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిమీ మేర వేదికలు సిద్ధం చేశారు. అన్ని వేదికలలో మ్యాట్‌లు, విద్యుద్దీపాలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయిలో ఒకేచోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ వర్షం పడితే.. కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక కూడా సిద్ధంగా ఉంది. జూన్ 21న…
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు విశాఖకు రానున్నారు. ప్రధాని శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌కు వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. రాత్రికి తూర్పు నౌకాదళం గెస్ట్ హౌస్‌లోనే బస చేస్తారు. శనివారం ఉదయం…
రికార్డులు సృష్టించేందుకు విశాఖ సన్నద్ధమైంది. యోగాంధ్ర 2025 సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొననున్నారు. మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. ప్రధానమంత్రి మోడీ సమక్షంలో విశాఖ యోగా డే డిక్లరేషన్ ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. మరోవైపు నగరంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది.…
యోగా అందరికీ నేర్పించాలా?.. అంతలా నిధులు ఖర్చుపెట్టాలా? అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ లాగా రాష్ట్రంలో పాలన కనిపిస్తోందని విమర్శించారు. పోలవరం, అమరావతి అలాగే ఉన్నాయని.. కొత్తగా బనకచర్ల వచ్చిందని విమర్శించారు. సంపద సృష్టిలో ఏదైనా ప్రత్యేక ముద్ర వేయాలి కానీ.. కొత్తగా ఏం చేయక్కర్లేదని సూచించారు. మహిళలకు ఉచిత బస్సును తాము స్వాగతిస్తాం అని బీవీ రాఘవులు తెలిపారు. అంతర్జాతీయ యోగా…
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ఏరియా తాత్కాలిక రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది. నేటి నుంచి 96 గంటల పాటు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ఆంక్షలు కొనసాగుతాయని వైజాగ్ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు. 5 కిలో మీటర్ల పరిధిలో ప్రైవేట్ డ్రోన్‌లను ఎగురవేయడం, నిరసనలు, ర్యాలీలు చేపట్టడం లాంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 నుంచి జూన్ 21 వరకు ‘యోగాంధ్ర’ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘పోలీసు యోగాంధ్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. అంతేకాదు యువతీ యువకులు…