విశాఖపట్నం వేదికగా ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. యోగాంధ్ర 2025కు విస్తృత ప్రచారం కల్పించడం, భారీ సంఖ్యలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు నెల రోజుల కార్యాచరణ ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా ఈరోజు బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ క్యాంపెయిన్లో మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్,…