స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయాంటే ఖచ్చితంగా సోషల్ మీడియా కూడా ఉంటుంది.. ప్రపంచం వ్యాప్తంగా ఏదైనా జరిగిన వెంటనే తెలిసిపోతుంది.. అందుకే ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు..ఇక కొంతమంది సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.. నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు తాజాగా ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తుంది.. ఓ వ్యక్తి రోడ్డుపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డుపై పుష్‌అప్‌లు చేస్తూ కనిపించాడు. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది… ఈ వీడియో పాతదే అయిన ఈరోజు యోగా డే సందర్బంగా మరోసారి వైరల్ అవుతుంది..
ఈ వీడియోను చూసిన వారంతా తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే..ఎవరైనా ఇంట్లో, జిమ్‌లో, పార్కులో చేస్తుంటారు. కానీ, వైరల్ అవుతోన్న వీడియోలో మాత్రం ఒక వ్యక్తి రోడ్డుపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డుపై పుష్‌అప్‌లు చేస్తూ కనిపించాడు. ఈ వింత సంఘటన ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజానికి ఈ వ్యక్తి రోడ్డుపై వేసిన సైన్ బోర్డుపైకి ఎక్కి పుషప్‌లు చేయడం చూసిన స్థానికులు, వాహనదారులు బెంబేలెత్తిపోయారు. అతడిని వింతగా చూస్తుండిపోయారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురయ్యారు.. అతను ఎలా ఎక్కడా అని ఆలోచనలో పడ్డారు..
ఆ వైరల్ వీడియోలో వ్యక్తి అర్ధనగ్నంగా ఉండి రోడ్డుపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డుపై ఎక్కి పుష్ అప్స్ చేస్తున్నాడు. అతన్ని చూసిన వాహనదారులు తమ వాహనాలను ఆపి మరీ అతన్నే చూస్తుండిపోయారు. కానీ అతను పుష్-అప్స్ చేస్తూనే ఉన్నాడు. అతన్ని అలా చూస్తుంటేనే ఒళ్లు భయంతో కంపిస్తుంది.. ఒక సన్నని బోర్డు పై అతను అలా చెయ్యడం అందరిని షాక్ కు గురి చేసింది..అతడు ఎలాంటి భయం లేకుండా పుష్‌అప్స్ చేస్తున్నాడు. అది ఎంత ప్రమాదకరమో.. ఫెమస్ అవ్వాలంటే కొత్తగా చెయ్యాలి కానీ ఇలా జనాలను బయపెట్టేలా ఉండకూడదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో మరోసారి ట్రెండ్ అవుతుంది..
మద్యం మత్తులో రోడ్డుపై ఎత్తయిన సైన్ బోర్డు ఎక్కి విన్యాసాలు చేసిన తాగుబోతు.. వీడియో వైరల్..#drunk #YogaDay #viralvideo #NTVTelugu pic.twitter.com/DTVoUtxe3Y
— NTV Telugu (@NtvTeluguLive) June 21, 2023