Yashasvi Jaiswal and Shubman Gill Fifties Help India Level Series vs West Indies: వెస్టిండీస్‌పై తొలి రెండు టీ20ల్లో ఓడి సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్.. అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లో నెగ్గిన యువ భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను టీమిండియా ఓడించింది. వెస్టిండీస్ నిర్ధేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (84 నాటౌట్; 51 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్ గిల్ (77; 47 బంతుల్లో 3×4, 5×6) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇక సిరీస్ డిసైడర్ అయిన చివరి టీ20 ఆదివారం జరగనుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మయర్ (61; 39 బంతుల్లో 3×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. షై హోప్ (45; 29 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మేయర్స్ (17), కింగ్ (18), పూరన్ (1), పావెల్ (1) విఫలమయ్యారు. హెట్‌మయర్ ధాటిగా ఆడి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (3/38), కుల్దీప్ యాదవ్ (2/26) ఆకట్టుకున్నారు.
Also Read: Gold Today Rate: మగువలకు బ్యాడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
ఛేదనలో భారత్‌కు ఏ ఇబ్బందీ ఎదురు కాలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడుతూ పరుగులు చేశారు. ముఖ్యంగా తొలి బంతికి ఫోర్ బాదిన యశస్వి.. వరుస బౌండరీలతో అలరించాడు. యశస్వి ధాటికి భారత్ తొలి 6 ఓవర్లలోనే 66 పరుగులు చేసింది. గిల్ కూడా బాదుడు మొదలెట్టడంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 100కు చేరింది. ఈ క్రమంలో 30 బంతుల్లో గిల్.. 33 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీలు పూర్తిచేశారు. భారత్ విజయానికి దగ్గరలో గిల్ ఔటైనా.. తిలక్ వర్మతో కలిసి యశస్వి పని ముగించాడు.
Shubman Gill – 77(47)
Yashasvi Jaiswal – 84*(51)
India beat West Indies by 9 wickets, 0-2 down in the series & now it's 2-2. What a comeback led by youngsters. pic.twitter.com/OSdxrai03j
— Johns. (@CricCrazyJohns) August 12, 2023