రెజ్లర్ల నిరసనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ నిరసన నుంచి తాను కాని, వినేష్ ఫోగట్ కాని, బజరంగ్ పూనియా కాని తప్పుకోవడం లేదని సాక్షి మాలిక్ సోమవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాము ముగ్గురం రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాము తమ ఉద్యోగాలలో తిరిగి చేరామే తప్ప నిరసన నుంచి ఉపసంహరించుకోలేదన్నారు సాక్షి మాలిక్.