బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశ ముగిసిన అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ కు చేరుకోగా.. ముంబయి-యూపీ వారియర్జ్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు 72 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ లోకి ప్రవేశించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలి కప్పును కైవసం చేసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి జట్టు భావిస్తున్నాయి. WPL లో ఇరుజట్లు రెండు సార్లు తలపడగా.. తొలి మ్యాచ్ లో ముంబయి 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందగా.. రెండోసారి ఢిల్లీ జట్టు 9 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది. ఇక ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో తుది మ్యాచ్ జరుగునుంది.
Also Read : Anrich Nortje : క్యాచ్ ఇలా కూడా పడతారా..?
అయితే బ్రబౌర్న్ పిచ్ బ్యాటింగ్ క అనుకూలంగా ఉండనుంది. ముంబయి ఇండియన్స్ కు జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆసిసీ కెప్టెన్ మెగ్ లానింగ్ సారథిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగనుంది.
Also Read : Terrible Incident : కొట్టాడు.. తోశాడు.. చెక్కాడు.. చంపాడు
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ ( కెప్టెన్ ), షెఫాలి వర్మ, జెమీమా, మరిజానె కాప్, అలిస్ క్యాప్సీ, జొనాసెస్, అరుంధతి, శిఖా పాండే, తానియా భాటియా వికెట్ కిపర్ ), రాధా యాదవ్, పూనమ్ యాదవ్/ మిన్ను మణి.
ముంబయి ఇండియన్స్ జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్ ( కెప్టెన్ ), యాస్తిక భాటియా ( వికెట్ కీపర్ ), హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, వాంగ్, అమన్ జోత్ కౌర్, హుమైరా కజి, జింటిమని కలిటా, సైకా ఇషాక్.
Also Read : Loan app fraud: లోన్ యాప్ పేరిట మోసం.. సిద్దిపేట, కరీంనగర్‌లో బాధితులు