Terrible Incident : కొట్టాడు.. తోశాడు.. చెక్కాడు.. చంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible Incident : హర్యానాలో మానవత్వాన్ని కాలరాసే దారుణ ఘటన వెలుగు చూసింది. కట్నం కోసం భార్యను హతమార్చిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త కట్నం తేవాలంటూ భార్యను చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని కొన్ని గంటలపాటు ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంట్లో వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: Loan app fraud: లోన్ యాప్ పేరిట మోసం.. సిద్దిపేట, కరీంనగర్‌లో బాధితులు
Also Read
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీర్ సింగ్ ఢిల్లీలో క్యాటరింగ్ చేసేవాడు. అదే రాష్ట్రానికి చెందిన అమ్మాయితో రెండేళ్ల క్రితం ఢిల్లీలోనే వివాహమైంది. పెళ్లయిన తర్వాత బీర్ సింగ్ కట్నం కోసం భార్యను వేధించేవాడు. మహేరున్ నుంచి కట్నం తీసుకురావాలని భార్యను పదే పదే అడిగాడు. అయితే భార్య కట్నం తీసుకురాకపోవడంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను చాలాసార్లు ఇంటిని గెంటేసేవాడు. కానీ మళ్లీ వెళ్లి అతను ఆమెను తిరిగి తీసుకువచ్చేవాడు. ఈ క్రమంలోనే బీర్ సింగ్ ఇంత దారుణమైన పని చేస్తాడని ఆ మహిళ కుటుంబం ఊహించలేదు. బిర్ తన భార్యను ముందుగా పైకప్పు నుండి కిందకు తోశాడు. ఈ తర్వాత ఆపై ఆమెను తీవ్రంగా కొట్టాడు. అక్కడితో ఆగకుండా పదునైన వస్తువుతో ఆమె చేతిపై తన పేరును టాటూగా చెక్కాడు. ఈ క్రమంలోనే ఆ దెబ్బలకు తాళలేక ఆమె కన్నుమూసింది.
Read Also:IPL 2023 : CSK పతనానికి అదే కారణం?.. “డాడ్స్ ఆర్మీ”కి మాథ్యూ హేడెన్ వార్నింగ్
బీర్ సింగ్ భార్యను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచాడు. అయితే తర్వాత ఏం చేయాలో అర్థంకాక పారిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!