ఆదివారం అంటే సెలవు దినంగా ఎంత ఎంజాయ్ చేస్తారో.. అదే విధంగా మరుసటి రోజు సోమవారం తిరిగి ఆఫీసులకు, పాఠశాలు, కళాశాలలకు వెళ్లడం అంటే అంత అయిష్టంగా ఫీల్ అవుతుంటారు. అయితే.. దాదాపు సోమవారం గురించి ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం ఇదే. వారం మొత్తం కష్టపడి పని చేసి శనివారం రోజు సాయంత్రం ఆహా రేపు ఆదివారం అంటూ మనసులోనే ఆనందపడే వారేందరో. అయితే.. అదే విధంగా.. సోమవారం ఉదయం.. అమ్మో.. ఈ రోజు సోమవారం అంటూ బాధపడుతూనే ఉంటారు. అయితే.. దీనిపై ఇటీవల సోషల్ మీడియాతో ‘Worst Day of The Week’ అంటూ సోషల్ మీడియాతో గత కొన్ని వారాల నుంచి ట్రెండ్ అవుతూ వస్తందో.
Also Read :Chinmayi: చిన్మయి అద్దె గర్భం.. ఇక నోరు మూసుకోండి
అయితే దీనిపై సర్వే నిర్వహించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. ఎక్కువ మంది సోమవారాన్ని వారంలో చెత్త రోజుగా ఏకీభవించారు. దీంతో.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోమవారం పట్ల ద్వేషాన్ని కూడా గుర్తించి దానిని ‘వారంలో చెత్త రోజు’గా పేర్కొంది. “వారంలో అత్యంత చెత్త రోజు రికార్డును మేము సోమవారం అధికారికంగా అందిస్తున్నాము” అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది.
we're officially giving monday the record of the worst day of the week
— Guinness World Records (@GWR) October 17, 2022