Artificial Womb: మానవ చరిత్రలో గొప్ప ఆవిష్కరణకు శాస్త్రవేతలు రూపం ఇచ్చారు. ఇప్పటి వరకు కృత్రిమ గర్భం అన్న పదం చాలామందికి తెలియదు. పెరుగుతున్న సాంకేతికతతో కొత్తగా శాస్త్రవేత్తలు తీసుకొచ్చిన ఆవిష్కరణతో మానవుడి ప్రతి సృష్టికి బీజం పడినట్లయింది. ఇకపై కోళ్లను ఫారాల్లో పెంచినట్టు.. మనుషులను కూడా ఫారాల్లో పెంచొచ్చు. ఆలోచనే కొత్తగా ఉంది కదూ ఇకపై ఇది ఆచరణలోకి రానుంది. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్, బయోటెక్నాలజిస్టు హాషీం అల్-ఘైలీ దీనికి సంబంధించిన వీడియోను తయారు చేశారు. ఆ వీడియో ప్రకారం.. గర్భాలను ఒక అండాకార పారదర్శక గాజు పెట్టె (బర్తింగ్ పాడ్)లో పెంచుతారు. అందుకోసం ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. వాస్తవంలో తల్లి గర్భంలో ఉండే అన్ని సదుపాయాలను ఇందులో ఏర్పాటు చేస్తారు. న్యూట్రిషన్లు, ఆక్సిజన్‌ను అందజేస్తారు.
Read Also:Thailand Princess : థాయ్ లాండ్ యువరాణికి గుండెపోటు
ప్రపంచంలోని ‘ఆర్టిఫిషియల్ వోంబ్ ఫెసిలిటీ’ ఒక కృత్రిమ గర్భం లేదా గ్రోత్ పాడ్‌లో ఒక ఏడాదిలో 30,000 మంది శిశువులను పెంచుతుందని పేర్కొంది. ఈ సదుపాయం ప్రస్తుతానికి ప్లానింగ్ లో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే చాలా మందికి ఉపయోగంగా ఉంటుంది. Fetolife అనేది ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ గర్భం లేదా పెరుగుదల పాడ్, ఇది పిల్లలు కావాలనుకునే వారికి చాలా పెద్ద ఉపశమనాన్ని అందిస్తుంది. ప్రస్తుతం తమ దేశంలో జనాభా క్షీణత సమస్యతో వ్యవహరిస్తున్న జపాన్, బల్గేరియా, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఇది సహాయపడుతుంది. ఒక కృత్రిమ గర్భం అనేది సాధారణంగా పిండాన్ని కాలానికి తీసుకువెళ్లే వ్యక్తి శరీరం వెలుపల పిండం పెరగడం ద్వారా ఎక్స్‌ట్రాకార్పోరియల్ గర్భధారణను ఎనేబుల్ చేసే పరికరాన్ని పోలి ఉంటుంది.
Read Also: Police Vehicle Theft: వీడు మామూలోడు కాదు.. పోలీస్ వెహికల్ నే ఎత్తుకెళ్లాడు
దాదాపు 75 ల్యాబ్‌లలో 400 చొప్పున పెట్టెలు ఉంటాయి. ఈ పెట్టెలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెన్సర్లు కూడా ఉంటాయి. ఆ సెన్సర్ల సాయంతో పెట్టెలోని గర్భం గుండెకొట్టుకొనే వేగం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయులను తెలుసుకోవచ్చు. ఇందులో అమర్చిన కెమెరా సాయంతో గర్భంలోని జన్యుపరమైన సమస్యలు తెలుసుకొని నియంత్రించవచ్చు. ఎప్పటికప్పుడు గర్భం పెరుగుదలను చూడొచ్చు. తల్లిదండ్రులు బిడ్డ పెరుగుదలను చూసేలా యాప్ ద్వారా అనుసంధానిస్తారు. వాళ్లు కావాలనుకొంటే పాటలు ప్లే చేయొచ్చు. ఆ బిడ్డకు ముచ్చట్లు చెప్పొచ్చు. బిడ్డను బయటకు తీయాలంటే ఆ బర్తింగ్ పాడ్‌పై ఉండే బటన్ నొక్కి చేతిలోకి తీసుకోవటమే. ఈ వీడియోను ‘ఎక్టోలైఫ్ ఆర్టిఫిషియల్ వూంబ్ ఫెసిలిటీ’ కోసం హాషీం రూపొందించారు.