Police Vehicle Theft: దొంగలు బాగా ముదిరిపోయారు.. ఇటీవల కాలంలో దొంగలకు భయం లేకుండా పోయింది.. అక్కడ ఇక్కడ దొంగతనాలు చేస్తే బాగుండదనుకున్నాడేమో ఏకంగా ఓ దొంగ పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లి వారికే షాక్ ఇచ్చాడు. ఇప్పుడది వైరల్ న్యూస్ అయిపోయింది. సూర్యాపేట పోలీస్ స్టేషన్ కు చెందిన పెట్రోలింగ్ వాహనాన్ని ఎత్తుకుపోయాడో దొంగ. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు TS 09 PA 0658 నంబరు కలిగిన పెట్రోలింగ్ వాహనాన్ని కొత్త బస్టాండ్ వద్ద నిలిపి పక్కకు వెళ్లారు. అర్జంట్ పని ఉండడంతో కారుకు తాళం వేయడం మర్చిపోయారు. ఇంకే ముంది అది గమనించిన దొంగ. చక్కగా కారు తాళం తీసుకుని కారుతో సహా అక్కడ నుంచి ఉడాయించాడు. వేరే కేసు కోసం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అటు వెళ్లగా, వాహనాన్ని గుర్తు తెలియని దుండగుడు చోరీ చేశాడు. పోలీసుల కారును ఎవరు టచ్ చేస్తార్లే అనుకున్నారేమో పోలీసులు.. వారి ధీమాకు మనోడు చక్కటి సమాధానం చెప్పినట్లయింది. కారుకే తాళాన్ని ఉంచడంతో దొంగ పని ఈజీ అయిపోయింది.
Read Also: Karnataka: స్కూల్ హెడ్‌మాస్టర్‌ని చితక్కొట్టిన అమ్మాయిలు..
బుధవారం (డిసెంబర్ 14,2022) తెల్లవారుజామున తెల్లారితే గురువారం అనగా 5 గంటలకు ఈ ఘటన జరిగింది. తమ వాహనం కనిపించకపోవడంతో పోలీసులు షాకయ్యారు. వెతకటం మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనం వెళ్లిన దారిని గుర్తించారు. కోదాడ వద్ద నిలిపి ఉంచిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా కారు తాళం తీసి ఉండటంతో ఈజీగా కారును చోరీ చేసిన సదరు దొంగ కోదాడకు వచ్చేసరికి కారులోని డీజిల్ అయిపోవటంతో ఆగిపోయింది. దీంతో దొంగ వాహనాన్ని అక్కడే వదిలేశాడు. కోదాడ వద్ద దుండగుడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది నవంబర్ 5న ఒడిశా రాయగఢ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఒక దుండగుడు అపహరించాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.