US vs Venezuela Military Power: ప్రపంచ రాజకీయ చరిత్రలో జనవరి 3 (శనివారం) , 2026 ఒక సంచలన రోజుగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. దీనికి కారణం వెనిజులాపై అమెరికా ఈ రోజున దాడి చేయడం. వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అరెస్టు చేసి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికా ఉన్నత ప్రత్యేక కార్యకలాపాల విభాగం డెల్టా ఫోర్స్ వెనిజులా అధ్యక్షుడు, ఆయన భార్యను అరెస్ట్ చేసింది. అయితే తాజాగా వెనిజులా రక్షణ మంత్రి లొంగిపోమని, ప్రాణం పోయే వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణ వాతావరణం కారణంగా, వీరి సైనిక శక్తి ఎంత అనే దానిపై పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రస్తుత వెనిజులా సైన్యం..
వెనిజులా సాయుధ దళాలను నేషనల్ బొలివేరియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (FANB) అని పిలుస్తారు. ఈ సైన్యం ప్రధానంగా రక్షణ వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రధాన పని దేశ భద్రత, ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడటం. దీని క్రియాశీల దళాలు సుమారు 190,000, రిజర్వ్ ఫోర్స్ సుమారు 8,000. పారామిలిటరీ, మిలిషియా దళాలతో సహా, మొత్తం సుమారు 220,000. అలాగే వెనిజులా వైమానిక దళం మొత్తం విమానాల సంఖ్య సుమారు 229. వాస్తవ యుద్ధ విమానాలు చాలా తక్కువ, ఎక్కువగా Su-30Mk2 వంటి పాత రష్యన్ విమానాలు ఉన్నాయి. వీటిని ప్రస్తుత ఆధునిక క్షిపణి, భూ బలగాలను ఎదుర్కోవడం కష్టం అని సమాచారం. వెనిజులా భూ బలగాలు సుమారు 8,800 సాయుధ వాహనాలను కలిగి ఉంటాయి. ట్యాంకుల సంఖ్య సుమారు 170 నుంచి 200 వరకు ఉంటాయి. నౌకాదళం విషయానికి వస్తే చిన్న పడవలు, కోస్ట్ గార్డ్ ఉంటాయి, పెద్ద యుద్ధనౌకలు లేదా విమాన వాహక నౌకలు ఈ దేశానికి లేవు. వెనిజులా సైనిక బడ్జెట్‌ను గమనిస్తే.. వెనిజులా రక్షణ బడ్జెట్ సుమారు $4 నుంచి $5 బిలియన్లు ఉంటుంది. మొత్తం మీద చూస్తే వెనిజులా సైన్యం ప్రాంతీయ రక్షణకు సరిపోతుంది, కానీ ప్రపంచ సైనిక శక్తి పరంగా చూస్తే బలహీనంగా, సాంకేతికంగా వెనుకబడి ఉంది.
యునైటెడ్ స్టేట్స్ సైనిక శక్తి విషయానికి వస్తే..
యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ ప్రపంచంలో అగ్ర శక్తి అనే బిరుదును కలిగి ఉంది. యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ ప్రపంచంలోనే అత్యంత బలమైన, వనరులతో కూడిన సైనిక దళంగా పేరుగాంచింది. దీనికి 1.3 మిలియన్లకు పైగా సైనిక బలం ఉంది. రిజర్వ్, నేషనల్ గార్డ్ సంఖ్య దాదాపు 800,000. ఈ సంఖ్య వెనిజులా కంటే 10 రెట్లు ఎక్కువ క్రియాశీల దళాల సంఖ్య. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ఉన్న US వైమానిక శక్తి F-22, F-35 వంటి ఆధునిక స్టెల్త్ ఫైటర్లతో సహా 13 వేల కంటే ఎక్కువ విమానాలను కలిగి ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇవి ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, అలాగే అత్యాధునిక విమానాలు కూడా. నావికా శక్తి పరంగా చూస్తే, నావికాదళంలో దాదాపు 440 యుద్ధనౌకలు ఉన్నాయి. వాటిలో 11 అణు విమాన వాహకాలు, క్షిపణి విధ్వంసక విమానాలు, జలాంతర్గామి-ప్రయోగించే U-బోట్లు కూడా ఉన్నాయి. అమెరికా సాంకేతికత, సామర్థ్యాలలో అణ్వాయుధాలు, ప్రపంచవ్యాప్త బేస్ నెట్‌వర్క్, ఉమ్మడి కమాండ్, నియంత్రణ, అంతరిక్ష దళం, సైబర్ వార్‌ఫేర్ సామర్థ్యాలు ఉన్నాయి. ఇవే అమెరికాను ప్రపంచంలోనే నంబర్ వన్ సైనిక శక్తిగా నిలిచేలా చేస్తున్నాయి.
రెండు దేశాల మధ్య సైనిక శక్తిలను గమనిస్తే దాదాపు అన్ని విభాగాల్లో కూడా అమెరికా వెనిజులా కంటే చాలా చాలా మెరుగైనదని కనిపిస్తుంది. ఒక వేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే, ముఖాముఖి యుద్ధంలో, వెనిజులా ఎక్కువ రోజులు మనుగడ సాగించలేకపోతుంది. అయితే ఈ దేశం లొంగిపోడానికి బదులు, గెరిల్లా యుద్ధ వ్యూహాలు, అంతర్గత మిలీషియాలను ఉపయోగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి పరిస్థితి అంతవరకు వెళ్తుందా, లేదా అనేది. ఏది ఏమైనా అమెరికా సైనిక శక్తి ముందు వెనిజులా మొకరిల్లిల్సిందే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
READ ALSO: Akhanda 2 Tandavam OTT: ఓటీటీలో ‘అఖండ 2’ తాండవానికి డేట్ ఫిక్స్ ..