NTV Telugu Site icon

World Bank: భారత్ కు ప్రపంచ బ్యాంకు షాకింగ్ న్యూస్.. ఇండియా ధనిక దేశంగా మారాలంటే..?

Bank

Bank

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అంటే ధనిక దేశంగా మార్చాలనేది ప్రస్తుత దేశ ప్రభుత్వ కల. కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడించింది. ఇది భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు పెద్ద షాక్‌గా ఉంటుంది. భారతదేశం, ప్రపంచంలోని అనేక దేశాలు సంపన్నులు కావడానికి సంవత్సరాలు పట్టవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. భారత్ లాంటి దేశం సంపన్నంగా మారడానికి 7 దశాబ్దాలకు పైగా పట్టే అవకాశం ఉందని నివేదికలో స్పష్టం చేసింది.

READ MORE:Degree in marriage: పెళ్లిపై డిగ్రీ ప్రవేశపెట్టిన చైనా యూనివర్సిటీ..

చైనాకు 10 ఏళ్లు, భారత్‌కు 75 ఏళ్లు..
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. భారతదేశంతో సహా 100 కంటే ఎక్కువ దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాలలో అధిక ఆదాయ దేశంగా మారడానికి తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కొంటాయి. భారతదేశం, యూఎస్ తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టవచ్చు. ప్రపంచ బ్యాంకు ‘వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2024: మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్’ ప్రకారం.. యూఎస్ తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి చైనాకు 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇండోనేషియాకు దాదాపు 70 సంవత్సరాలు పడుతుంది. ఈ నివేదిక గత 50 సంవత్సరాల అనుభవం ఆధారంగా రూపొందించినట్లు వరల్డ్ బ్యాంకు పేర్కొంది.

READ MORE:Vietnam: భారతీయ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లోకి బతికి ఉన్న ఈల్.. కడుపులో పేగుల్ని తీనేసింది..

ప్రపంచంలోని ముగ్గురిలో ఇద్దరు అత్యంత పేదవారు..
2023 చివరి నాటికి, ప్రపంచ బ్యాంక్ 108 దేశాలను మధ్య ఆదాయ సమూహంగా వర్గీకరించింది. వారి తలసరి వార్షిక GDP యూఎస్$1,136 నుంచి యూఎస్$13,845 వరకు ఉంది. ప్రపంచ జనాభాలో 75 శాతం ఉన్న ఈ దేశాలలో ఆరు బిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు.

READ MORE:Terrorist Attack: జమ్మూలో ఉగ్రవాదుల దాడి భయం.. ఆర్టికల్ 370 వార్షికోత్సవానికి ముందే హై అలర్ట్

ఆర్థికవేత్తలు ఏం చెబుతున్నారు?
ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, అనేక మధ్య-ఆదాయ దేశాలు ఇప్పటికీ గత శతాబ్దపు వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను పెంచడానికి రూపొందించిన విధానాలపై ఆధారపడుతున్నాయి. ఫస్ట్ గేర్‌లో పెట్టి కారును వేగంగా నడపడానికి ప్రయత్నించడం లాంటిది. ఈ దేశాలు పాత వ్యూహానికి కట్టుబడి ఉంటే, ఈ మధ్య నాటికి సంపన్న సమాజాలను నిర్మించే రేసులో ఈ దేశాలు చాలా వరకు వెనుకబడిపోతాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇందర్మీత్ గిల్ అన్నారు.