రోజు రోజుకు కీచకపర్వం రాజ్యమేలుతోందనడంలో ఆతిశయోక్తి లేదనిపిస్తోంది. నేటి సమాజంలో స్త్రీ జాతిపై ఇక్కడా.. అక్కడా అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడా వేధింపులకు పాల్పడుతున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల జూబ్లీహిల్స్ డీఏవీ పాఠశాలలో జరిగిన ఘటన మచ్చుతునక. అయితే.. గతంలో కంటే ప్రస్తుతం మహిళలపై వేధింపులు పెరిగాయని తాజా నివేదకలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర రాజధానిలోని మూడు కమిషరేట్లలో ఒకటైన సైబరాబాద్ పరిధిలో మహిళలపై వేధింపుల కేసులు మరింత పెరినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లోనే మహిళా వేధింపుల కేసులు 75 నమోదయ్యాయి. అయితే.. ఇప్పటికే.. సైబరాబాద్ పరిధిలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం 11 షీటీమ్స్ పనిచేస్తున్నాయి. మహిళల వేధింపులపై కేవలం వాట్సాప్ ద్వారానే 50 ఫిర్యాదులు అందడం గమనార్హం. ఫోన్లలో వేధించిన కేసులు 24 నమోదు కాగా.. బ్లాక్‌మెయిల్ కేసులు 13 నమోదయ్యాయి.
Aslo Read : Rahul Gandhi : బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దోచుకుని పనిలో ఉన్నాయి
వీటితో పాటు.. బెదిరింపుల కేసులు 5, సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొన్న మహిళల ఫిర్యాదులు 5, అసభ్య పదజాలంతో ఇబ్బంది పడ్డ కేసులు 2, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా ఇబ్బందులు పడిన కేసులు 2, పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులు 5 నమోదు, ఫొటో మార్ఫింగ్ కేసులు 2, చైల్డ్ మ్యారేజ్ కేసులు 2 చొప్పున నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. చిన్నా పెద్దా తేడా లేకుండా.. స్త్రీలపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతున్నా.. కామాంధుల వెన్నులో వణుకుపుట్టడం లేదు. స్త్రీని గౌరవించడంలో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచిన భారతవానిలో ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్టకు మచ్చలా మిగిలుతున్నాయి.