AP Crime: బయటకు పొక్కిన గుట్టు.. వదిన, మరిది ఆత్మహత్య..
- అనంతపురం జిల్లాలో వదిన.. మరిది ఆత్మహత్య
- బయటపడిన ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం
- రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇరువురు
- చాగల్లు రిజర్వాయర్ లో దూకి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: గుట్టుగా సాగుతోన్న వ్యవహారం బట్టబయలు అయ్యింది.. తలెత్తుకుని కుటుంబ సభ్యులకు ముఖం చూపించలేకపోయారు.. ఇంతకంటే తమ ప్రాణాలు విడిచిందే మంచిదనే నిర్ణయానికి వచ్చారేమో.. ఆ వదిన, మరిది.. రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లులో వెలుగు చూసింది.
Read Also: Kadapa Crime: తల్లితో సహజీవనం.. నిలదీసిన కొడుకు దారుణ హత్య..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అనంతపురం జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీకి చెందిన మహబూబ్ బాష, గుత్తి మండలం బేతాపల్లి గ్రామానికి చెందిన నిజామ… వదిన, మరిది అవుతారు.. అయితే, రెండు రోజుల క్రితం ఇరువురు ఇంటినుండి వెళ్లిపోయారు.. ఆదివారం సాయంత్రం చాగల్లు రిజర్వాయర్ వద్ద మోటార్ సైకిల్, అందులో మొబైల్ ఫోన్ ఉండడంతో చాగల్లు డ్యామ్ వద్ద ఉన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్‌ఫోన్ ఆధారంగా నిజామ భర్త జిలాన్ ఫిర్యాదు మేరకు.. పెద్దపప్పూరు ఎస్సై గౌస్ మహమ్మద్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం చాగల్లు రిజర్వాయర్ లో ఓ మహిళ శవం తేలడంతో.. బంధువులతో కలిసి ఎస్సై సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి మృతి చెందిన మహిళ నిజామ అని గుర్తించారు. జిలాన్ ఆటో తోలుకుంటూ గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో జీవనం సాగిస్తున్నారు.. వారికి 16 సంవత్సరాల అమ్మాయి, 14 సంవత్సరాల అబ్బాయి ఉన్నారు. జిలాన్ కు సొంత తమ్ముడు అయిన మహబూబ్ బాష, నిజామ వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని.. ఈ విషయం బహిర్గతం కావడంతో ఇద్దరు కలిసి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు.. ఇక అదే రిజర్వాయర్‌లో మహబూబ్ బాషా మృతదేహం లభ్యమైంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?