Crime News: అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు వివాహిత దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆమె వద్దనే 2.5 లక్షల అప్పు తీసుకున్న ఓ వ్యక్తి.. అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27 మహిళా అదృశ్యం కేసు నమోదు కాగా.. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా పాలమాకుల గ్రామంలో చోటుచేసుకుంది.
Read Also: Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామానికి చెందిన గుడెపు యాదమ్మ గత నెల 27న శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి రాళ్లగూడలోని బంధువుల ఇంటికి వెళుతునట్లు ఇంట్లో వాళ్ళకు చెప్పి వెళ్ళింది. అయితే అదేరోజు చీకటి పడిన అమె తిరిగి ఇంటికి రాలేదు. బంధువులకు ఫోన్ చేసిన ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు.. ఆమె వాడిన ఫోన్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. యాదమ్మ చివరి ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడింది అనే విచారించగా సంఘిగూడ గ్రామానికి చెందిన శంకరయ్యగా తేలింది. అయితే ఈ నెల 5వ తేదీన శంకరయ్యను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. దీంతో శంకరయ్య యాదమ్మను పెద్దషాపూర్ బస్టాండ్ వద్ద బైక్ పై ఎక్కించుకుని సంఘిగూడలోని తన పొలానికి తీసుకెళ్ళానని చెప్పాడు. పొలం వద్దకు చేరుకున్న ఇద్దరికి అప్పటికే వివాహేతర సంబంధం ఉన్నట్లు అదే చనువుతో యాదమ్మ వద్ద శంకరయ్య 2.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే పొలం వద్ద ఇద్దరి మద్య డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో కోపానికి గురైన శంకరయ్య బండరాయితో అమె తలపై బలంగా కొట్టాడు. దీంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే భయబ్రాంతులకు గురైన శంకరయ్య ఏం చేయాలో తెలియక తన వద్ద ఉన్న జేసీబీ సహాయంతో పొలంలోనే గొయ్యి తవ్వి యాదమ్మ మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు స్థానిక ఎమ్మార్వో నాగమణి సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీయించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?