కరోనా తర్వాత వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ఎంత ప్రాధాన్యత వచ్చిందో చెప్పక్కర్లేదు. దాదాపు కొన్ని నెలల పాటు ఇంటి నుంచే ఉద్యోగులు పనులు చేశారు. ఇప్పటికే ఆయా కంపెనీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. జూమ్ మీటింగ్‌లు ద్వారా అటెండై ఆఫీస్ పనులు కానిచ్చేసేవారు. కోవిడ్ తర్వాతే గూగుల్ మీట్, జూమ్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. దాదాపు అందరూ వీటిమీదే ఆధారపడి కార్యక్రమాలు నిర్వహించారు. అయితే టెక్ హబ్ అయిన బెంగళూరులో చాలా మంది ఉద్యోగులు.. ఇప్పటికీ ఈ డిజిటల్ విప్లవాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. బెంగళూరులో ఓ సిగ్నల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఓ ఉద్యోగి.. బైక్‌పై ఉండగానే ఆఫీస్ పనులు కానిచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Delhi High Court: భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని తప్పుడు ఆరోపణలు చేయడం మానసిక క్రూరత్వమే..
బెంగళూరులోని ఓ సిగ్నల్ దగ్గర వాహనాలు ఆగి ఉన్నాయి. అక్కడ స్కూటీ మీద వెళ్తున్న మహిళ జర్నీ చేస్తూనే ఆఫీస్‌కు సంబంధించిన ఆన్లైన్ మీటింగ్‌కు హాజరైంది. అయితే కారులో ఉన్న ఓ వ్యక్తి ఆమెను వీడియో తీసి SHAAN SUNDAR అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్.. బెంగళూరులోని ఓ సాధారణ రోజు అంటూ కామెంట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి:T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ లో కీలక బాధ్యతలు చేపట్టనున్న సిక్సర్ల కింగ్.. ఆఫీసియల్..
వేల సంఖ్యలో వ్యూస్ సాధించింది. ఈ వీడియో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. ఆ వీడియో ఎక్కడ తీశారో లోకేషన్ చెప్పాలని అడిగారు. అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. బెంగళూరులో ఇలాంటివి సర్వ సాధారణమేనని.. బెంగళూరు వాసులు ఎలాంటి పరిస్థితిలోనైనా పని చేయాల్సి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోలో ఏముందో మీరు కూడా చూసేయండి.
சாலையிலும் வேலை
வேற என்ன பண்றதுஅது சரி
சிக்னல பாருங்கடாண்ணா
இவனுங்க எதுக்கு என்னையே பார்த்துக்கொண்டு இருக்கிறானுங்கள் pic.twitter.com/CiMo58flEQ— SHAAN SUNDAR🖤♥️🖤♥️ (@Sun46982817Shan) April 23, 2024