పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. పెళ్లి కోసం ఎన్నో కలలు కంటుంటారు యువతీ యువకులు. అబ్బాయి, అమ్మాయి ఇష్టాయిష్టాలతో జరిగేది పెళ్లి. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా పెళ్లి జరిగినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. బలవంతపు బాసింగాలు ఎంతకాలం నిలుస్తాయి. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలు ఎక్కువగా జరుగుతుండేవి.. ఇప్పుడు ప్రేమ వివాహాలు ఎక్కువైపోతున్నాయి. కొంతమంది అమ్మాయిలు పెద్దలను ఎదిరించి మరి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొంత మంది తల్లిదండ్రుల మాట కాదనలేక.. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులు ఇస్తున్నారు. ఇంకొందరు అమ్మాయిలు ఏకంగా భర్త ప్రాణాలను తీస్తున్నారు.
Also Read:Akhanda 2 Teaser : అఖండ-2 టీజర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే..
ఇటీవల భార్యలు భర్తలను చంపిస్తున్న ఘటనలు చూసి పెళ్లంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు యువకులు. సింగిల్ గా అయినా ఉంటాం. కానీ ఈ జనరేషన్ అమ్మాయిలను మాత్రం పెళ్లి చేసుకోము బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. పెళ్లి అయ్యాక కూడా ప్రియుడితో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తలను అంతమొందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. కొంతకాలం క్రితం యూపీలోని మీరట్ లో సౌరభ్ కుమార్ ను తన భార్య ముస్కాన్ రస్తోగి ప్రియుడి సాయంతో అతికిరాతకంగా చంపింది. భర్త డెడ్ బాడీని ముక్కలు ముక్కులుగా నరికి డ్రమ్ములో వేసి సిమెంట్ తో కప్పేసింది. ప్రియుడి మోజులో పడి సుపారీ ఇచ్చి భర్తల ప్రాణాలు తీస్తున్నారు.
Also Read:Sonam-Raja Case: ప్రియుడి సాయంతోనే రాజాను సోనమ్ చంపింది.. పోలీసులు వెల్లడి
ఆ మధ్య అమీన్ పూర్ లో ప్రియుడి మోజులో పడి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసింది ఓ తల్లి. తాజాగా మేఘాలయలో హనీమూన్ కు వెళ్లి కిరాయి రౌడీలతో భర్తను చంపించిన భార్య ఉదంతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో ప్రియుళ్ల కోసం భర్తల ప్రాణాలు తీస్తున్నారు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. కొందరు అమ్మాయిలు పెళ్లికి నో చెప్పి తల్లిదండ్రులను బాధపెట్టడం కంటే కట్టుకున్న భర్తను చంపించడం ఈజీ అనుకుంటున్నారు అని రాసుకొచ్చాడు. ఇది నెట్టింటా చర్చనీయాంశంగా మారింది. ఈ జనరేషన్ అమ్మాయిలు కొత్త ట్రెండ్ ఏమైనా సెట్ చేస్తున్నారా అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు.
Also Read:BJP MP Laxman: రాహుల్, రేవంత్ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు!
ఒకప్పుడు తల్లిదండ్రులు తమ కూతుర్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కొడుకులను రక్షించుకోవాల్సిన పరిస్థితి దాపరించిందంటున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఓ వ్యక్తి ప్రాణాన్ని తీయడం కంటే ముందుగానే ప్రేమించిన ప్రియుడితో వెళ్లిపోవచ్చు కదా అని పలువురు కామెంట్ చేస్తున్నారు. లేకపోతే డివోర్స్ ఇచ్చి ఎవరికి నచ్చినట్లు వారు బతకొచ్చు కదా అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భర్తలను చంపి కటకటాలపాలై అటు కన్న తల్లిదండ్రులను.. ఇటు కట్టుకున్న వాడి ఫ్యామిళిని రోడ్డున పడేస్తున్నారు. అమ్మాయిలు ఇలా చేయడం మీకు తగునా అని యువకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్తలను బతకనివ్వరా.. భర్తల కోసం కూడా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ తరం అమ్మాయిలు ఇలా ప్రవర్తించడానికి కారణాలు ఏంటి? సినిమాల ప్రభావమా? సోషల్ మీడియా ఎఫెక్టా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:YS Jagan: అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ..! ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ..!
ఇష్టం లేని పెళ్లిళ్లు
తల్లిదండ్రులు ఎవరైనా ఎదిగిన తమ కూతురికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలనుకుంటారు. మంచి వరున్ని చూసి ఘనంగా పెళ్లి చేయాలని భావిస్తారు. కానీ ఇదంతా ఒకప్పటి లెక్క. ఇప్పుడు అంతా మారిపోయింది. పేరెంట్స్ మంచి సంబంధాన్ని కుదిర్చి పెళ్లి చేయాలని భావిస్తే ఆ పెళ్లి పెళ్లి పీటలెక్కడం లేదు. ఒక వేళ పెళ్లి జరిగినా కొన్ని రోజులకే వివాహబంధానికి స్వస్తి పలికి ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. దీనికి గల కారణం ఆ యువతీ అప్పటికే మరో వ్యక్తిని ప్రేమించడం. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకపోవడం. తమ ప్రేమ విషయాన్ని చెప్పి తల్లిదండ్రులను నొప్పించలేక అయిష్టంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఒక వేళ ప్రేమ విషయాన్ని చెప్పినా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఎక్కడ కూడా అనుమానం రాకుండా నయవంచనకు పాల్పడుతున్నారు కొందరు యువతులు. పెళ్లి తర్వాత ప్రియుడిని మర్చిపోలేక కట్టుకున్న వాడిని కాటికి పంపిస్తున్నారు. మరికొంతమంది తీరా తాళి కట్టే సమయానికి పెళ్లి ఇష్టం లేదని షాక్ ఇవ్వడం.. ఇదంతా ఈ రోజుల్లో కామన్ అయిపోయింది.
Also Read:Balakrishna Fans : థియేటర్లోకి బీర్, ఇడ్లీ.. బాలయ్య ఫ్యాన్స్ హంగామా
సినిమాలు, సోషల్ మీడియా ఎఫెక్ట్
రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి తేడా ఉంటుందనే నిజాన్ని కొంతమంది యువతులు తెలుసుకోలేక పోతున్నారు. లైఫ్ ని లగ్జరీగా ఊహించుకుని తీరా పెళ్లయ్యాక తాము ఎక్స్ పెక్ట్ చేసిన విధంగా లైఫ్ లేదని విడాకులకు సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియా(ఇన్ స్టా, ఫేస్ బుక్, టెలిగ్రాం, స్నాప్ చాట్) పరిచయాలు ప్రేమగా మారుతున్నాయి. ప్రేమించిన ప్రియుడి కోసం ఇంట్లోనుంచి వెళ్లి పోయి కన్నవారికి కన్నీళ్లను మిగుల్చుతున్నారు. కూతుర్లు ఇలా చేయడంతో కొంతమంది పేరెంట్స్ సమాజంలో తమ పరువు పోయిందని భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లి అనేది నిండు నూరేళ్ల ప్రయాణం.. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని భర్తల పాలిట యుముడిగా మారొద్దని.. జీవితాలను నాశనం చేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు.