పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. పెళ్లి కోసం ఎన్నో కలలు కంటుంటారు యువతీ యువకులు. అబ్బాయి, అమ్మాయి ఇష్టాయిష్టాలతో జరిగేది పెళ్లి. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా పెళ్లి జరిగినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. బలవంతపు బాసింగాలు ఎంతకాలం నిలుస్తాయి. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలు ఎక్కువగా జరుగుతుండేవి.. ఇప్పుడు ప్రేమ వివాహాలు ఎక్కువైపోతున్నాయి. కొంతమంది అమ్మాయిలు పెద్దలను ఎదిరించి మరి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొంత మంది తల్లిదండ్రుల…