మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని మద్యం షాపుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో 4 బ్రాందీ షాపులను లూటీ చేశారు ప్రజలు. షాపుల యజమానులపై దాడి చేసి మరీ బాటిల్లను ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీలో ఏకంగా రూ. 50 లక్షల విలువచేసే మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లినట్లు సదరు షాపు యాజమాన్యులు అంటున్నారు. కొందరు మందు బాబులు మద్యం షాపులోకి వెళ్లి అధిక రేట్లకు అమ్ముతున్నారని షాపు యజమానులను నిలదీయసాగారు. ఈ సందర్బంగా షాప్ యజమానులకు, మందుబాబులకు మధ్య కాస్త వాగ్వివాదం చోటుచేసుకుంది.
Also read: Amalapuram: బీజేపీ గూటికి వైసీపీ ఎంపీ భర్త..!
ఆ చిన్న వాగ్వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానలా మారి షాపులను లూటీ చేసే స్థితికి చేరుకుంది. ఆ సమయంలో అందినకాడికి మద్యం బాటిళ్లను దోచుకొని వెళ్ళారు మందుబాబులు, వారి కుటుంబసభ్యులు. ఇక ఇదే మంచి సమయం అనుకుని అటుగా వెళ్ళే కొందరు మహిళలు కూడా ఆ షాపులో ఉన్న మద్యం బాటిల్స్ ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై మద్యం షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో కాస్త జాప్యం జరిగింది.
Also read:Yarlagadda VenkatRao: యర్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ న్యాయవాది కేవీ రమణ..
ఇలా చేయడం వల్ల షాప్ యజమానుల పై పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైన్ షాపు బీఆర్ఎస్ కు చెందిన ఒక నేత ఆధీనంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్లు ఇతర మద్యం వ్యాపారులతో కలిసి అంతా కలిసి సిండికేట్ గా మారి వారి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాకపోతే అప్పటికే చాలా మంది మద్యం బాటిళ్లను బాక్సులు బాక్స్ లుగా ఎత్తుకెళ్లారు.