మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని మద్యం షాపుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో 4 బ్రాందీ షాపులను లూటీ చేశారు ప్రజలు. షాపుల యజమానులపై దాడి చేసి మరీ బాటిల్లను ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీలో ఏకంగా రూ. 50 లక్షల విలువచేసే మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లినట్లు సదరు షాపు యాజమాన్యులు అంటున్నారు. కొందరు మందు బాబులు మద్యం షాపులోకి వెళ్లి అధిక రేట్లకు అమ్ముతున్నారని షాపు యజమానులను…