జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం (జూన్ 22) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. సమావేశానంతరం ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, ఇప్పుడు రాష్ట్రాలు కలిసి దాని రేటును నిర్ణయించాలని అన్నారు.