Extra Marital Affair: లేటు వయసులో ఘాటు లవ్.. ప్రియుడి మోజులో పడి 60 ఏళ్ల భర్తను మర్డర్ చేయించిన వైనం
- లేటు వయసులో ఘాటు లవ్
- ప్రియుడి మోజులో పడి 60 ఏళ్ల భర్తను మర్డర్ చేయించిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య వివాహేతర బంధాలు.. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కూడా చంపేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు కొంత మంది భార్యామణులు. కొత్తగా పెళ్లైన వారైనా సరే.. ఏళ్ల తరబడి కాపురం చేస్తున్నవారైన సరే.. దీనికి మినహాయింపు లేకుండా పోయింది. కర్ణాటకలో మరీ దారుణంగా వృద్ధాప్యానికి దరిదాపుల్లో ఉన్న మహిళ ప్రియుడి మోజులో పడి 60 ఏళ్ల భర్తను మర్డర్ చేయించడం కన్నడనాట సంచలనం సృష్టించింది. లేటు వయసులో ఘాటు లవ్.. నిజానికి ఈ మాటల్ని వృద్ధ దంపతులు అత్యంత అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపితే వాడతాం.. కానీ కర్ణాటకలో ఓ మహిళ.. తన భర్తతో కాకుండా మధ్య వయసు ఉన్న యువకుడితో ఘాటు లవ్ ట్రాక్ నడిపింది. అంతే కాదు.. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతేర్చింది.
Also Read:Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
ఈ ఫోటోలో ఉన్న వృద్ధ దంపతుల పేర్లు సుబ్రమణ్య, మీనాక్షమ్మ. ఇద్దరూ భార్య భర్తలు. కర్ణాటకలోని చిక్కమగళూరు వీరి స్వస్థలం. నిజానికి అంతా బాగా ఉంటే వీరిద్దరూ షష్టిపూర్తి చేసుకోవాల్సి ఉంది. కానీ సుబ్రమణ్య చనిపోయాడు.. అతన్ని మర్డర్ చేయించినందుకు మీనాక్షమ్మ జైలు పాలైంది. దాదాపు 2 నెలల క్రితం జరిగిన ఘటనలో.. సుబ్రమణ్య కనిపించకుండా పోయాడు. అన్ని ప్రాంతాలు వెతికిన తర్వాత భార్య మీనాక్షమ్మ, ఇద్దరు కూతుళ్లు అతనిపై మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు.. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రైల్వే ట్రాక్ పక్కన డెడ్ బాడీని కనుక్కున్నారు. రైలు ఢీకొట్టినట్లుగా ఉంది. డెడ్ బాడీకి కొద్ది దూరంలోనూ కొన్ని శరీర భాగాలు పడి ఉన్నాయి. వాటిని సమీకరించి… పోస్టు మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందించారు.
Also Read:Railway Luggage Rule: రైల్వే ప్రయాణికుల అదనపు లగేజీపై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి
ఐతే సుబ్రమణ్య మృతిపై పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. పక్కా మర్డర్ అని భావించారు. ఆ దిశగా దర్యాప్తు చేశారు. ముందుగా భార్య మీనాక్షమ్మపై ఎలాంటి డౌట్ రాలేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా.. పోలీసులకు జులై 31న ఓ సీసీ ఫుటేజీ అనుమానాస్పదంగా కనిపించింది. దానిలో ముగ్గురు యువకులు సుబ్రమణ్యను కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు గుర్తించారు. ప్రదీప్, సిద్దేష్, విశ్వాస్ అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అందులో ప్రదీప్ అనే 33 ఏళ్ల వ్యక్తికి మీనాక్షమ్మతో వివాహేతర బంధం ఉన్నట్లుగా గుర్తించారు. అంతే కాదు.. వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో మీనాక్షమ్మ సూచన మేరకే సుబ్రమణ్యను మర్డర్ చేయించినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు పోలీసులు. కూతుర్ల ఫిర్యాదు మేరకు మీనాక్షమ్మను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!