Wife Kills Husband: దేశవ్యాప్తంగా వరుసగా భర్తలను చంపిన భార్యల కేసులు నమోదవుతున్నవేళ.. సరిగ్గా అలాంటి ఘటనే వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో వెలుగులోకి వచ్చింది. భర్తను కూల్‌గా చంపేందుకు కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలిపింది. ఆస్పత్రిలో రెండు రోజులపాటు అతడు పోరాడి చనిపోయాడు. ఈ ఘటన వర్ధన్నపేటలోని భవానికుంట తండాలో సంచలనం సృష్టించింది. అమాయకంగా కనిపించే ఆమె పేరు కాంతి. వరంగల్ జిల్లా వర్థన్నపేట సమీపంలోని భవానికుంట తండాకు చెందిన ఈమెకు జాటోత్ బాలాజీతో వివాహం జరిగింది. చాలా కాలం నుంచి వీరి కాపురం బాగానే సాగుతోంది. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు.
Read Also:Digital Micro Finance: డిజిటల్ మైక్రోఫైనాన్స్.. 500 మంది రోడ్డుపాలు..!
బాలాజీ.. వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 8న దాటుడు పండుగను బాలాజీ కుటుంబసభ్యులతో కలిసి జరుపుకొన్నాడు. ఆ రోజు సాయంత్రం మద్యం తాగడానికి వెళ్తానంటూ బాలాజీ ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో భార్య కాంతి నైస్‌గా పలకరించింది. ప్రేమగా పలకరించి.. తాగేందుకు కూల్ డ్రింక్ ఇచ్చింది. అందులో కాలకూట విషం దాగుందనే విషయాన్ని బాలాజీ పసిగట్టలేకపోయాడు. భార్య ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి అస్వస్థతకు గురయ్యాడు.
Read Also:Akash Prime: వైమానిక రక్షణలో మరో అస్త్రం.. 15,000 అడుగుల ఎత్తులో ‘ఆకాశ్ ప్రైమ్’ విజయవంతం..!
కానీ, ఆ సమయంలో భర్తను పట్టించుకోలేదు కాంతి. పైగా తనకు ఏం సంబంధం లేనట్లు వ్యవహరించింది. అంతే కాదు భర్తను ఆ స్థితిలోనే వదిలేసి తాళ్లకుంట తండాలో ఉంటున్న అక్క- బావ ఇంటికి వెళ్లింది. ఇరుగు పొరుగు వారు గుర్తించి బాలాజీని ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు అక్కడే చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. భార్యా కాంతి అతన్ని చంపిందంటూ బాలాజీ బంధువులు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని.. ఆ గొడవలు మనసులో పెట్టుకొనే కాంతి.. తన బావ దస్రూతో కలిసి ఈ ఘటనకు పాల్పడిందంటూ పోలీసులకు మృతుడి తండ్రి హరిచందర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.