Digital Micro Finance: NRI అన్నాడు…పేదల ఆసుపత్రికి కోట్ల రూపాయల పరికరాలు ఇస్తామన్నారు…పోలీసులు, ప్రజాప్రతినిధులతో ఫోటోలు దిగాడు.. పెద్ద బిజినెస్ మ్యాన్ అంటూ కలర్ ఇచ్చాడు. సూటు బూట్‌తో అందరిని బుట్టలో వేశాడు. ఉద్యోగాలు ఇస్తామన్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ సందుగ సర్దేశాడు. 500 మందిని రోడ్డుపాలు చేయడంతో వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇంతకీ డిజిటల్ మైక్రోఫైనాన్స్ పేరుతో మోసం చేసిన ఆ వైట్ కాలర్ క్రిమినల్ ఎవరు?
ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కృష్ణ. ఇతను ఆదిలాబాద్‌లో ఎస్. కె గ్రూప్ పేరుతో వ్యాపారం స్టార్ట్ చేశాడు. డిజిటల్ మైక్రోఫైనాన్స్ పేరుతో దందా మొదలు పెట్టాడు. అక్కడ బిల్డింగ్ దానికి సంబంధించిన బ్యాంక్ ఉంది. ఇలాంటి బ్యాంకుల బ్రాంచీలను ఉట్నూర్, జైనూర్‌లో ఏర్పాటు చేశాడు. అంతే కాదు 500 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టాడు. పెద్ద హోటల్‌లో ప్రజా ప్రతినిధులను పిలిచి.. భోజనాలు పెట్టి తెగ హడావుడి చేశాడు.
Off The Record: మైనంపల్లి, మర్రి రాజశేఖర్రెడ్డి మధ్య సవాళ్ల పర్వం..
దీనితో, చాలా మంది నిరుద్యోగులు అతని ఉచ్చులో పడ్డారు. దీంతో సార్ అసలు స్వరూపం బయట పెట్టాడు. మీరంతా ఉద్యోగంలో చేరినట్టేనని చెప్పి.. ఒక్కొక్కరి వద్ద రూ. 20వేల చొప్పున డబ్బు వసూలు చేశాడు. అందరికీ డ్రెస్, షూ పేరుతో వీటిని వసూలు చేశాడు. తీరా చూస్తే 2 నెలలు గడిచింది. జీతం లేదు.. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదు. అనుమానం వచ్చిన ఉద్యోగులు బాధితులు వాట్సాప్ గ్రూప్‌లలో పోస్టులు పెట్టడంతో మరో ట్విస్ట్ ఇచ్చాడు కృష్ణ. ఆయన గొప్ప హృదయం కలిగిన చైర్మన్ పని చేయకున్నా జీతాలు ఇస్తాడు అని మెసేజ్‌లు పెట్టించాడు.
ఉద్యోగులు దీన్ని నమ్మేలా లేకపోవడంతో మరో ఎత్తుగడకు తెర తీశాడు కృష్ణ. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి కోటిన్నర రూపాయలతో వైద్య పరికరాలు అందిస్తున్నట్లు.. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ ఇచ్చిన పరికరాల లిస్ట్ కాపీని వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి నమ్మించాడు. ఐతే రిమ్స్ అడిగిన తేదీ దాటిపోవడంతో మరో కట్టుకథ అల్లాడు. రిమ్స్ వాళ్లు ఎక్కువ అడిగారు కాబట్టి కాస్త ఆలస్యం అవుతోందని సోషల్ మీడియాలో ప్రచారం చేయించాడు.
Real Estate Scam: వెలుగులోకి మరో రియల్ ఎస్టేట్ మోసం.. ఈసారి ఎంతమంది బాధితులంటే..?
ఇక చివరకు ఈ కృష్ణ లీలలు మామూలుగా లేవు. జిల్లా ఎస్పీ, రిమ్స్ డైరెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎంపీతోపాటు ఇతర ప్రజాప్రతినిధులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్మార్ట్‌గా చీటింగ్‌కు తెరతీశాడు. ఉద్యోగం ఊరికే వస్తుందని చెప్పిన మాటలు నమ్మారు నిరుద్యోగులు. కానీ షూ, డ్రెస్ పేరుతో డబ్బులు లాగాడు. అలా వసూల్ చేసిన డబ్బులే లక్షల్లో జమకావడంతో అంతా ఉడాయించారు. సీన్ కట్ చేస్తే నమ్మిన వాళ్లంత నష్టపోయారు. మన అవసరం ఉందని పక్కోడికి తెలిస్తే అంతే.. మన నెత్తిన శఠగోపం పెట్టినట్టే.. సో అలర్ట్ అని చెబుతున్నారు పోలీసులు.