Wife killed Husband : నిండునూరేళ్లు నీవెంటే ఉంటానంటూ పెళ్లి చేసుకుని మరొకరితో సంబంధాలు పెట్టుకుని నమ్మిన వాళ్లని మట్టుపెడుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాదులో ఇలాంటి ఘటనే నాలుగేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం హత్య జరుగగా కేసును పోలీసులు చేధించారు. కేసులో మృతుడి భార్యతో పాటు తన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పరిధిలో చంద్ర వీర్, సవిత దంపతులు స్థానికంగా నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సవితకు అరుణ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
Also Read : Mizoram : మిజోరాంలో కూలిన క్వారీ.. శిథిలాల్లో చిక్కుకున్న15మంది కార్మికులు
దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. 2018లో అరుణ్, సవిత కలిసి.. చంద్రవీర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం కేసుకప్పి పుచ్చేందుకు .. చంద్ర వీర్ మృతదేహాన్ని అరుణ్ ఇంట్లో ఏడు అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారు. తర్వాత పైన సిమెంట్ ప్లోరింగ్ వేశారు. అనంతరం తన భర్తను బంధువులు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసులో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అయితే తాజాగా లభించిన కొన్ని ఆధారాల ద్వారా లోతుగా దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు అరుణ్, సవితను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులైన సవిత, అరుణ్ ను కోర్టులో హాజరు పర్చనున్నారు పోలీసులు.
#SSP_GZB @IPSMUNIRAJ के निर्देशन में क्राइम ब्रांच व थाना नन्दग्राम द्वारा 04 वर्षाें से लापता चल रहे चंद्रवीर उर्फ पप्पू नामक व्यक्ति की हत्या का खुलासा, पत्नी सहित प्रेमी गिरफ्तार, अभियुक्तगण ने हत्या कर शव को घर में दफना दिया था। मृतक का शव व घटना में प्रयुक्त आलाकत्ल बरामद। pic.twitter.com/NrGvHBEs1Y
— GHAZIABAD POLICE (@ghaziabadpolice) November 14, 2022