తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి పక్కన చంద్రవిలాసపురం పంచాయతీ పరిధిలోని సుందరరాజపురం గ్రామానికి చెందిన యువరాజ్ (29) శ్రీపెరంబుదూర్‌లోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇతనికి మేనమామ కూతురు గాయత్రి(25)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న గాయత్రి ఒక్కసారిగా కేకలు వేసింది. ఆమె అరుపులకు వచ్చిన ఇరుగుపొరుగు వారు యువరాజ్ మృతదేహం వేలాడుతూ ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. అయితే తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని తండ్రి ఆరుముగం ఆర్కేపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : Coal Mine Collapse: కుప్పకూలిన బొగ్గుగని.. ఇద్దరు మృతి, 50 మందికి పైగా మిస్సింగ్
ఈ విషయమై యువరాజ్ భార్య గాయత్రిని పోలీసులు విచారించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. ఆమెను పోలీస్‌స్టేషన్‌ను తరలించి విచారణ చేపట్టారు పోలీసులు. విచారణలో పలు విస్మయకర సమాచారం వెల్లడైంది. ఈ విషయమై పోలీసులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శ్రీనివాసన్ అనే వ్యక్తితో గాయత్రి ప్రేమలో పడింది. అయితే.. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన యువరాజ్ మామ హడావుడిగా గాయత్రికి యువరాజ్‌తో వివాహం జరిపించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత శ్రీనివాసన్‌తో ప్రేమను మరచిపోలేక మళ్లీ శ్రీనివాసన్‌తో లైంగిక సంబంధం పెట్టుకుంది గాయత్రి. అయితే.. గాయత్రిపై అనుమానం వచ్చిన భర్తకు ఓరోజు విషయం తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
Also Read : Namrata Shirodkar: ఏసియన్ నమ్రత ‘ప్యాలెస్ హైట్స్’ రెస్టారెంట్ ప్రారంభం
ఈ నేపథ్యంలో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని పథకం వేసింది. దీని ప్రకారం యువరాజ్ ఇంట్లో నిద్రిస్తుండగా గాయత్రి, శ్రీనివాసన్ అతని స్నేహితులు యువరాజ్‌ని గొంతునులిమి చంపారు. అనంతరం ఆత్మహత్య అని ఇరుగుపొరుగువారిని నమ్మించేందుకు మృతదేహానికి ఉరివేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం గాయత్రి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేయగా అది బట్టబయలైంది. ఈ హత్యకేసులో గాయత్రి, శ్రీనివాసన్, మణికందన్, జిల్లు లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలులో పంపించారు పోలీసులు