Illegal Affair: అక్రమం సంబంధం మోజులో.. కట్టుకున్న భర్తను కాటికి పంపిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజు రోజుకు నేటి సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతోంది. అక్రమ సంబంధాల మోజులో పడి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న వారినే కాటికి పంపుతున్నారు. అలాంటి ఘటనే ఇది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గాయ గాయపాక ప్రవీణ్ కుమార్ (35) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన లావణ్య అనే అమ్మాయితో గత నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే.. ప్రవీణ్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రవీణ్ రోజులాగే పనిమీద బయటకు వెళ్లెవాడు. అయితే.. ఈ నేపథ్యంలో స్థానికుడైన తంగళ్ల సుమంత్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేత సంబంధానికి దారికి తీసింది. అయితే.. ఈ విషయం ప్రవీణ్‌కు తెలిసి భార్య లావణ్యను వారించాడు.
Also Read : Crime : కుక్కపై వ్యక్తి అత్యాచారం.. కేసు నమోదు చేసిన పోలీసులు
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
దీంతో రెండేళ్ల క్రితం ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. అయితే ఇటీవల ప్రియుడితో తిరిగి వచ్చిన లావణ్య అదే బస్తీలో.. తన భర్త ఇంటికి పక్కవీధిలోనే ఇల్లు తీసుకుని ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే తనంటే ఇష్టం లేకపోతే విడాకులు ఇవాలని, ఇలా వేరే వారితో తనకళ్ళ ముందే సహజీవనం చేయడాన్ని జీవించుకోలేకపోయాడు ప్రవీణ్ కుమార్. లావణ్య మీద ఇదే విషయంగా ప్రవీణ్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా.. అనేకసార్లు పెద్దమనుషులతో పంచాయతీ పెట్టించాడు ప్రవీణ్. అయితే, లావణ్య మాత్రం తాను ప్రియుడితోనే ఉంటానని తేల్చిచెప్పడంతో.. ఈ విషయం మీద వాళ్ళ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
Also Read : West Bengal : ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి.. ఆ స్కామ్ వల్లే..?
ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ శనివారం రాత్రి కూడా భార్య, ఆమె ప్రియుడు ఉంటున్న ఇంటికి వెళ్లడంతో.. కంగారు పడ్డ లావణ్య పోలీసులకు సమాచారం అందించింది. వారు అక్కడికి వచ్చి అతడిని ఇంటికి పంపించి వేశారు. అయితే, అప్పటికి వెళ్ళిపోయిన అతడు ఆదివారం ఉదయం మళ్లీ వచ్చాడు. దీంతో లావణ్య తన ప్రియుడితో కలిసి రోకలిబండతో ప్రవీణ్ మీద దాడి చేశారు. ఈ దాడిలో గాయపడి స్పృహ కోల్పోయాడు ప్రవీణ్ తీవ్రంగా. ఇది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని ప్రవీణ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతనికి చికిత్స అందించారు. కానీ చికిత్స పొందుతూనే ప్రవీణ్ మృతి చెందాడు. దీంతో పోలీసుల కేసు నమోదు చేసుకొని లావణ్యతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!