మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి తెలియంది కాదు.. ఎన్నో సూపర్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.. ఒకప్పుడు నువ్వు సినిమాలకు సెట్ కావు అన్నవాళ్ళే మెగాస్టార్ అని జేజేలు కొట్టించుకున్నారు.. అలాంటి వ్యక్తిని సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా పిలుస్తుంటారు.. ఆయన వచ్చిన ఈవెంట్స్ ఎంతగా ఆకట్టుకుంటాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన చిరంజీవి తన గురించి ఎన్నో సంచలన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ ఈవెంట్ లో చిరంజీవి జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి పంచుకున్నారు.. తాను సినిమాల్లోకి రాకముందు ఎదుర్కొన్న సమస్యలు, పడ్డ అవమానాల గురించి చెప్పుకొచ్చాడు.. అలాగే మెగాస్టార్ అవుతానని, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకునే స్థాయికి ఎదుగుతానని ఎప్పుడైనా ఊహించారా’ అని ప్రశ్నించారు. దానికి చిరు చెప్పిన సమాధానం అందరిని ఆకట్టుకుంది.. ఒక్క మాటలో కష్టం ఊరికే పోదు అని చెప్పేసాడు..
ఇక ఈ సందర్బంగా చిరంజీవికి ఇష్టమైన సినిమాల గురించి చెప్పాడు.. చిరంజీవి మాట్లాడుతూ.. నాకు ఎటువంటి సినిమాలు ఇష్టమో చెబితే ఖచ్చితంగా నవ్వుతారు.. నాకు చిన్న పిల్లల సినిమాలు అంటే చాలా ఇష్టం.. మిక్కి మౌస్, కోకోమెలోన్, ఇంకా కామెడీ సినిమాలను ఎక్కువగా చూస్తాను.. మా గ్రాండ్ డాటర్స్ తో పాటుగా అలవాటు అయిపొయిందని చెప్పుకొచ్చాడు.. ఇక ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు..