One Nation One Election: మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ అనే అంశంపై ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సు నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గురువారం నాడు సమర్పించింది. ఈ నివేదికలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలనే భావనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీల జాబితా కూడా ఉంది. ఈ నివేదికలో దాదాపు 47 రాజకీయ పార్టీలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. వీటిలో 32 పార్టీలు అంగీకరించగా, 15 పార్టీలు ఏకకాల ఎన్నికలపై విభేదించాయని రామ్ నాథ్ కోవింద్ ప్యానెల్ నివేదికలో పేర్కొంది.
Read Also: MLA Mahipal Reddy: తప్పు చేస్తే ఫెనాల్టీ వేయండి.. కన్నీరు పెట్టుకున్న మహిపాల్ రెడ్డి..
ఇక, ఒకే దేశం ఒకే ఎన్నికపై నిరసన తెలిపిన 15 రాజకీయ పార్టీలు ఎవరు.. వారు చెప్పిన కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే, జాతీయ పార్టీలలో, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది వారు ఆరోపిస్తున్నారు. ఇక, ప్రాంతీయ పార్టీలలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF), తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM), DMK, నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF), సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సహా రాష్ట్రీయ లోక్ జనతాదళ్, భారతీయ సమాజ్ పార్టీ, గూర్ఖా నేషనల్ లిబరల్ ఫ్రంట్, హిందుస్తానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని వ్యతిరేకించాయి.
Read Also: PM Modi: వచ్చే వారం భూటాన్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోడీ..
అయితే, 2019లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న 19 పార్టీలలో 16 ఏకకాల ఎన్నికల ఆలోచనకు మద్దతు ఇచ్చాయి.. మూడు పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయని నివేదికలో పేర్కొంది. కమిటీ నివేదిక ప్రకారం.. ఏకకాల ఎన్నికలను వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు దీనిని ఆమోదించడం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిస్తుందని, అప్రజాస్వామికం, ఫెడరలిజానికి వ్యతిరేకమని, ప్రాంతీయ పార్టీలను పక్కన పెడుతుందని ఆయా పార్టీలు భయపడుతున్నాయి. ఇది జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని ప్రోత్సహిస్తుంది అని నివేదికలో వెల్లడైంది.
Read Also: BJP-SAD alliance: బీజేపీకి గట్టి షాక్.. పొత్తు లేదని తేల్చి చెప్పిన సుఖ్బీర్ సింగ్
ఒకే దేశం ఒకే ఎన్నికను వ్యతిరేకించిన పార్టీలు ఇవే..?
* ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)
* బహుజన్ సమాజ్ పార్టీ (BSP)
* కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPIM)
* భారత జాతీయ కాంగ్రెస్ (INC)
* ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF)
* ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC)
* ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM)
* కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)
* ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)
* నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF)
* సమాజ్ వాదీ పార్టీ (SP)
* మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMC)
* విడుతలై చిరుతిగల్ కట్చి (VCK)
* కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
* సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)