Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అలాగే టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌసు నుంచి బయటకు వచ్చాడు. నిన్నటి ఎపిసోడ్ తో ఫైనల్ కంటెస్టెంట్ల జాబితా కొంతమేరకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్ టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్లలో ఆల్రెడీ టికెట్ టు ఫినాలె గెలిచి అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు.. సో టాప్ 5 కి ఈ సీజన్ లో అవినాష్ ఓ అడుగు ముందు నిలిచాడు. ఇక మిగిలింది నలుగురు మాత్రమే. ఆ నలుగురిలో ప్రస్తుతం టైటిల్ రేసులో దూసుకెళ్తున్న మరో ఇద్దరు కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ టైటిల్ రేసులో ఉన్న నిఖిల్, గౌతమ్ ఇద్దరు కూడా లాస్ట్ వీక్ దాకా ఉంటారని దాదాపు ఫిక్స్ అయిపోయారు. అలా చూస్తే అవినాష్ తో పాటు నిఖిల్, గౌతమ్ ఈ ముగ్గురు టాప్ 5 లో కన్ఫర్మ్ అయినట్లే. అంటే ఐదుగురిలో ముగ్గురు కన్ ఫర్మ్ అయితే ఇంకా కావాల్సింది ఇద్దరు మాత్రమే. ఆ ఇద్దరు ఎవరు.. ఏ ఇద్దరికి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది అన్నది చూడాలి. సీజన్ 8 లో శనివారం ఎపిసోడ్ తో టాప్ 5 లో దాదాపు క్లారిటీ వచ్చేసింది.
Read Also:Parenting Tips: మీ పిల్లల పేరెంట్స్ మీటింగుకు వెళ్తున్నట్లయితే టీచర్‌ని ఈ ప్రశ్నలు అడగడం మరవద్దు
అవినాష్ టికెట్ టు ఫినాలె గెలవడంతో పాటు ఈ వీక్ సేవ్ అవ్వడంతో అతను మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన అవినాష్ ఓ పక్క ఎంటర్టైన్ చేస్తూనే టాస్కుల్లో కూడా ఆయన తన సత్తా చాటాడు. హౌస్ లో అప్పటివరకు స్ట్రాంగ్ గా అనిపించుకున్న వాళ్లను కూడా ఓడిస్తూ అవినాష్ టాస్కులు గెలుస్తూ వచ్చాడు. అందుకే అతను ఈ సీజన్ ఫైనలిస్ట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ 5 లో అవకాశం దక్కించుకునే ఆ లక్కీ 2 ఎవరన్నది మరో రెండు వారాల్లో తెలుస్తుంది. ఐతే ఈ సీజన్ ట్విస్టులు, టర్న్ లు అంటూ సడెన్ గా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టాడు బిగ్ బాస్. ఆదివారం ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం టాప్ 5 లో ఆల్రెడీ అవినాష్ వెళ్లాడు కావున టాప్ 4 లో లెక్కలు మారే అవకాశం ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 రాబోయే రెండు వారాల ఆటను బట్టే టాప్ 5లో కి వెళ్లే ఆ నలుగురు కంటెస్టెంట్లను డిసైడ్ చేస్తారు. మరి అది ఎవరన్నది చూడాలంటే రెండు వారాలు ఆగాల్సిందే.
Read Also:Mulugu: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు వెల్లడి..