కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగడం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారులకు రాయితీతో కూడిన రుణాలు ఇస్తామని చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకు వస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Today Stock Market Roudup 20-04-23: తొలిసారి రూ.5 ట్రిలియన్లు దాటిన ఐటీసీ మార్కెట్ క్యాప్
తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరు అందలేదని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ను చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరామ్ పూర్ మండలంలో ఈ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల దగ్గర నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు తెలిపిన అన్ని సమస్యను వెంటనే తీర్చుతామని భట్టి చెప్పుకొచ్చారు.
Also Read : BJP Reacts: గాంధీ కుటుంబంపై చెంపదెబ్బ.. సూరత్ కోర్టు తీర్పుపై బీజేపీ
కేసీఆర్ సర్కార్ వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. మరో వైపు ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు అని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎవరి జనాభా ఎంత ఉందో బడ్జెట్ లో అన్ని నిధులు కేటాయించాలి అని అన్నారు. బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారు.. వెంటనే బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి అని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అమలు చేస్తాం.. ఇందిరమ్మ రాజ్యం అమలు చేసేవారే సీఎం అవుతారు.. అధిష్టానానికి అన్నీ తెలుసు.. సీఎం ఎవరు అనేది వారే నిర్ణయిస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.